HomeతెలంగాణKarimnagar ORR: ఉత్తర తెలంగాణకు గ్లోబల్‌ హబ్‌గా కరీంనగర్‌.. ఓఆర్‌ఆర్‌ కీలక మైలురాయి!

Karimnagar ORR: ఉత్తర తెలంగాణకు గ్లోబల్‌ హబ్‌గా కరీంనగర్‌.. ఓఆర్‌ఆర్‌ కీలక మైలురాయి!

Karimnagar ORR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లకు ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మూడు ఓఆర్‌ఆర్‌లతో హైదరాబాద్‌ సులభంగా అనుసంధానం అవుతుంది. సుడా మాస్టర్‌ ప్లాన్‌లో కేఎన్‌ఆర్‌ ఓఆర్‌ఆర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఉత్తర తెలంగాణ అభివృద్ధికి చారిత్రక మలుపు. 120 కి.మీ. పొడవు, రూ.15 వేల కోట్ల బడ్జెట్‌తో 2028 నాటికి పూర్తి చేయాలని అంచనా. ఇప్పటికే రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసింది. కేఎన్‌ఆర్‌ సిటీ సెంటర్‌ను చుట్టిముట్టిన 8–లేన్‌ […]

Karimnagar ORR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లకు ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మూడు ఓఆర్‌ఆర్‌లతో హైదరాబాద్‌ సులభంగా అనుసంధానం అవుతుంది. సుడా మాస్టర్‌ ప్లాన్‌లో కేఎన్‌ఆర్‌ ఓఆర్‌ఆర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఉత్తర తెలంగాణ అభివృద్ధికి చారిత్రక మలుపు. 120 కి.మీ. పొడవు, రూ.15 వేల కోట్ల బడ్జెట్‌తో 2028 నాటికి పూర్తి చేయాలని అంచనా. ఇప్పటికే రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసింది. కేఎన్‌ఆర్‌ సిటీ సెంటర్‌ను చుట్టిముట్టిన 8–లేన్‌ హైవే నిర్మిస్తారు.

ప్రాజెక్ట్‌ విశేషాలు
కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌ ఐటర్‌ రింగ్‌రోడ్‌ హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ కారిడార్‌తో లింక్‌ అవుతుంది. వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు 45 నిమిషాల దూరం మాత్రేమ ఉంటుంది. ఆరు జంక్షన్లు, ఫ్లై ఓవర్లు, లాండ్‌ స్కేపింగ్‌తో రూపొందుతుంది. భూసేకరణ 70 శాతం పూర్తయింది. దీంతో హైవేలపై రద్దీ 40 శాతం తగ్గుతుంది. లాజిస్టిక్స్‌ ఖర్చు 20 శాతం తగ్గుతుంది. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్‌ హబ్‌గా కేఎన్‌ఆర్‌ లక్ష మందికిపైగా ఉద్యోగాలు వస్తాయి. ల్యాండ్‌ రేట్లు 25–40 శాతం పెరగడంతో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లు వెలుస్తాయి.

హైదరాబాద్‌ కేంద్రీకృత అభివృద్ధికి ప్రత్యామ్నాయంగా కేఎన్‌ఆర్‌ ఉద్భవిస్తోంది. రాష్ట్ర జీడీపీ 12 శాతం ఉంది. యువతకు అవకాశాలు, మైగ్రేషన్‌ తగ్గుదల. అయితే, భూసేకరణ వివాదాలు, పర్యావరణ ప్రభావాలు, రైతుల పునరావాసం మేనేజ్‌ చేయాలి. రేవంత్‌ ప్రభుత్వం ఇది ’ఉత్తర తెలంగాణ రిసర్జెన్స్‌’గా చూపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper