Homeజాతీయ వార్తలుHappy Independence Day 2024 : బ్రిటిష్ గుండెల్లో గుబులు పుట్టించిన ఈ కొటేషన్ల ద్వారా...

Happy Independence Day 2024 : బ్రిటిష్ గుండెల్లో గుబులు పుట్టించిన ఈ కొటేషన్ల ద్వారా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపండి..

Happy Independence Day 2024 :  భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు అవుతోంది. బ్రిటిష్ వాళ్లు భారతదేశాన్ని విడిచిపెట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రతీ ఏడాది ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈరోజున విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ఉదయమే రెడీ అయి జెండా పండుగలో పాల్గొంటారు. స్వాతంత్ర్య సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఈ పోరాటంలో అమరులైన వారి గొప్పతనాలను పెద్దలు వివరిస్తూ ఉంటున్నారు. ఆ తరువాత కొందరు విద్యార్థుల చేత స్వాతంత్ర్యం రావడానికి కారణాలను ఉపన్యాసం ద్వారా చెప్పిస్తున్నారు. అయితే స్వాంత్ర్య వేడుకల సందర్భంగా ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు. కొందరు సాధారణంగా శుభాకాంక్షలు చెబితె..మరికొందరు ఏదైనా కొటేషన్ ద్వారా విషెస్ చెబుతూ ఉంటారు. అయితే విషెష్ చెప్పే కొటేషన్ ఆకట్టుకునే విధంగా కవిత్వం రూపంలో ఉంటే బాగుంటుంది. ప్రస్తుతం కాలంలో మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. ఎక్కడి వారు అక్కడే స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించుకుంటున్నారు. అయితే దూర ప్రదేశాల్లో ఉన్న వారికి లేదా స్వాతంత్య్రం ఎలా వచ్చింది? అనే విషయాలను తెలుపుతూ మెసేజ్ ద్వారా కొటేషన్లు పెడితే ఆకట్టుకోగలుగుతారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న కొందరు వీరులు కొన్ని నినాదాలు గుర్తు చేస్తూ పెడితే మరింత ఆకర్షణగా నిలుస్తారు. స్వాతంత్ర్యం రావడానికి ఈ నినాదాలు ఎంతో ఉపయోగపడ్డాయి. కొందరు కవితలు, తమ నినాదాల ద్వారా బ్రిటిష్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. అంతటి నినాదాలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఎవరెవరు ఎటువంటి నినాదాలు చేశారో చూద్దాం..

‘స్వరాజ్యం నా జన్మహక్కు దీనిని నేను పొందుతాను.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’-బాల గంగాధర్ తిలక్

‘దేశంలో స్వేచ్చా జీవనం కావాలంటే సైనికుల రక్షణ మాత్రమే కాదు.. దేశం మొత్తం ప్రజలు బలంగా ఉండాలి’- లాల్ బహదూర్ శాస్త్రి

‘స్వేచ్ఛ జీవనం కావాలంటే మూల్యం చెల్లించుకోవాల్సిందే’-రవీంద్రనాథ్ ఠాగూర్

‘మనం చనిపోయేంత వరకు ధైర్యంగా ఉందాం.. కానీ ఎవరూ బలిదానం కోరవద్దు’-మహాత్మగాంధీ

‘సత్యమేవ జయతే’-పండిట్ మదన్ మోహన్ మాలవ్య

‘రైతుల కుటీరం నుంచి.. ఇల్లు ఊడ్చేవారితో సహా భారతదేశం కోసం తరలిరండి..’-స్వామి వివేకానంద

‘మనదేశం కోసం మనం ఏం చేయగలం.. మనకోసం మనదేశం ఏమి చేసింది’?-జవహర్ లాల్ నెహ్రూ

‘మనిషి జీవించడానికి స్వేచ్ఛ కచ్చితంగా కావాలి.. కానీ ఈ స్వేచ్ఛ కోసం ఏమి చెల్లించనక్కర్లేదు.. ఒక అంకిత భావం తప్ప’-మహాత్మ గాంధీ

‘స్వేచ్ఛ భారత్ కోసం తూటాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధవంగా ఉన్నాం..’-చంద్ర శేఖర్ ఆజాద్

‘వినయంతో కూడిన జ్ఞానం..విలువలేనిది’-పండిట్ మదన్ మోహన్ మాలవ్య

‘స్వేచ్ఛ ఒకరు ఇచ్చేది కాదు.. ఇది జన్మహక్కు.. దీని కోసం పోరాటం తప్పదు’-అనిబిసెంట్

‘వారు నన్ను చంపొచ్చు.. కానీ నా ఆలోచనలు చంపలేరు’- భగత్ సింగ్

‘హిందీ, హిందూ, హిందుస్థాన్’-భరతేందు హరిశ్చంద్ర

‘సైమన్ గో బ్యాక్’ లాలా లజపతిరాయ్

‘దుష్మన్ కీ గోలియోంకా హ్ సామ్నా కరేంగే ఆజాద్ హీం రహేం హై’ -చంద్ర శేఖర్ ఆజాద్

‘విజయి విశ్వ త్రిరంగా ప్యారా, ఝండా ఉంచా రహే హమారా’-శ్యామ్ లాల్ గుప్తా

‘జై జవాన్.. జై కిసాన్’ లాల్ బహదూర్ శాస్త్రి

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular