Flag Hoisting : స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమైనది జాతీయ జెండా. జాతీయ జెండా మనకు, దేశానికి గౌరవ చిహ్నం. మువ్వన్నెల పతాకాన్ని స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు ప్రత్యేక సందర్భం, దినోత్సవాల్లో ఎగురవేస్తారు. దేశభక్తి, ప్రతిష్టను పెంచే పలు కార్యక్రమాలు కూడా జాతీయ జెండాలను వినియోగిస్తారు. గతేడాది ‘హర్ ఘర్ తిరంగ’ అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఆదేశించింది. అయితే ఇక్కడ జాతీయ జెండాలను ఎగురవేయడంలో కొన్ని నిబంధనలు పాటించాలి. ఇందు కోసం రాజ్యాంగం ఫ్లాగ్ కోడ్ ను నిర్దేశించింది. ఇది తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. మువ్వన్నెల రెపరెపలతో ప్రతి హృదయం దేశభక్తిని చాటుతుంది. సైనిక బలగాల కవాతు, ఎయిర్ ఫోర్స్ తదితర ప్రదర్శనలు ఈ దినోత్సవాల్లో ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. సంస్కృతిక కార్యక్రమాలు కూడా దేశభక్తిని చాటేలా నిర్వహించబడుతాయి. ఇక జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాలాపాన కొనసాగుతుంది. ఆద్యంతం అత్యంత అద్భుతంగా సాగే ఈ కార్యక్రమాలు ప్రతి భారతీయుడి గుండెలో నిలిచిపోతాయి. ఇక జాతీయ జెండాలను ముందుగా ప్రభుత్వ భవనాలపై ప్రభుత్వ అధికారులే ఎగురవేయాలని అనుమతులు ఇచ్చారు. కానీ 2001లో సుప్రీంకోర్టు లో నవీన్ జిందాల్ వేసిన ఒక పిటిషన్ తర్వాత పౌరులు కూడా మువ్వన్నెల జెండాను ఎగురవేసుకోవచ్చని అనుమతించారు. ఆ తర్వాత కూడా చట్టంలో అనేక సవరణలు చేశారు. జాతీయ జెండా భూమిని, నీటిని తాకకూడదు. ఇక వేదిక ఎదుట, బల్లలపై క్లాత్ గా జాతీయ జెండాను వినియోగించవద్దు. ఉద్దేశ పూర్వకంగా తలకిందులుగా జాతీయ జెండాను ఉంచకూడదు. విగ్రహాలు, వస్తువులపై వేలాడదీయకూడదు. జెండా గర్తులను నడుము వద్ద, లోస్తులుగా వినియోగించరాదు.
జెండా ఎగురవేసే సమయంలో కేవలం పూలు మాత్రమే అందులో ఉంచాలి. మరే వస్తువులు అందులో ఉంచరాదు. జాతీయ జెండా ఏదైనా రాయడం పూర్తిగా నిషిద్ధం. ఇక జాతీయ జెండాను సూర్యోదయం సమయంలో ఎగురవేయాలి. సూర్యాస్తమయంలోగా దించాలి. ఇక జాతీయ జెండా మురికిగా లేకుండా చూసుకోవాలి. ఇక స్తంభాలు, భవనాలు, పోడియం, రెయిలింగ్ లను కవర్ చేయడానికి ఎట్టిపరిస్థితుల్లో జాతీయ జెండాలను వాడకూడదు. జాతీయ జెండాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి వీలులేదు.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని జెండాను ఎగురవేస్తారు. ఇక గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ర్టపతి ఎగురవేస్తారు. ఎర్రకోటపై జరిగే వేడుకల్లో వీరు పాల్గొంటారు. తిరంగా జెండా దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో త్యాగాలకు ప్రతీక. ప్రజాస్వామ్య దేశ చిహ్నంగా మన జెండా నిలుస్తుంది. అలాంటి జెండాను గౌరవించడం దేశ పౌరులుగా అందరి బాధ్యత. గతేడాది తపాలా శాఖ కేవలం 15 రోజుల్లోనే పది లక్షల జెండాలను విక్రయించింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను కొనుగోలు చేశారు.
ఇక జాతీయ జెండాను అగౌరవ పరిస్తే జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం, 1971 లోని సెక్షన్ 2 ప్రకారం ఏదైనా బహిరంగ ప్రదేశాల్లో, పబ్లిక్ వీక్షణలో ఇతర ప్రదేశాల్లో జాతీయ జెండాను కాల్చడం, తొక్కడం, అపవిత్రం చేయడం, లాంటివి చేస్తే ఇది దేశ ధిక్కారమే అవతుంది. ఈ చట్టం ప్రకారం శిక్షకు అర్హులు అవుతారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More