spot_img
Homeజాతీయ వార్తలుAssam Congress Crisis: అస్సాంలో కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు.. ఎన్నికల్లో గెలిచేదెలా రాహుల్‌?

Assam Congress Crisis: అస్సాంలో కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు.. ఎన్నికల్లో గెలిచేదెలా రాహుల్‌?

Assam Congress Crisis: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. పొత్తులు, సీట్ల సర్దుబాట్లు కూడా కొలిక్కి వచ్చాయి. నామినేషన్లు వేసిన అభ్యర్థులు, పార్టీలు ప్రచారం జోరు కూడా పెంచుతున్నాయి. అయితే కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడులో కాంగ్రెస్‌ బలంగా కనిపిస్తోంది. అయితే ఈ సమయంలో ఆ పార్టీ నేతలు షాక్‌ ఇస్తున్నారు. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర బోరా తర్వాత మార్గరీటా ఎంపీ ప్రద్యుత్‌ బోర్గులై రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయన కుమారుడు ప్రతీక్‌ కూడా పార్టీ టిక్కెట్‌ తిరస్కరించి పోటీకి సిద్ధం కాదని ప్రకటించడంతో పార్టీకి మరింత షాక్‌.

Also Read: రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్ర*గ్స్ పార్టీ: సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!

సీనియర్‌ నేతల రాజీనామాలు
ప్రద్యుత్‌ బోర్గులై, నాగావ్‌ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు గెలిచిన కాంగ్రెస్‌ ఎంపీ, అంతర్గత విభేదాల కారణంగా పార్టీకి రాజానామా చేశారు. భూపేంద్ర బోరా రాజీనామా తర్వాత ఇది మరో దెబ్బ. మార్గరీటా అసెంబ్లీ స్థానానికి ప్రతీక్‌ బోర్గులై ప్రకటించింది కాంగ్రెస్‌. అయితే తాను పోటీ చేయనని తెలిపారు. ఈ సంఘటనలు పార్టీ స్థిరత్వాన్ని దెబ్బతీశాయి.

80 మంది కీలక నేతలు కూడా..
ప్రద్యుత్‌ రాజీనామాతో పాటు 80 మంది కీలక కార్యకర్తలు కాంగ్రెస్‌ వదిలేశారు. ఎన్నికల ముందే ఈ సంఖ్యలో వలసలు పార్టీ ఓటు బ్యాంకును బలహీనపరుస్తున్నాయి. బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియా ద్వారా మాజీ కాంగ్రెస్‌ నేతలను ఆకర్షిస్తూ పార్టీ బలం పెంచుకుంటోంది.

అంతర్గత సంక్షోభం
కాంగ్రెస్‌లో అభ్యర్థి ఎంపిక, నాయకత్వ విభేదాలు ప్రధాన కారణాలు. ఒకప్పుడు అస్సాంలో బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ ఆధిపత్యం ముందు బలహీనపడుతోంది. రాహుల్, ప్రియాంక గాంధీ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఈ వలసలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయి.

బీజేపీ ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని కాంగ్రెస్‌ బలహీనతను హైలైట్‌ చేస్తోంది. మార్గరీటా స్థానంలో తండ్రి–కొడుకుల విభజన రాజకీయ ఆసక్తిని రేపుతోంది. కాంగ్రెస్‌ ఈ సంక్షోభాన్ని అధిగమించకపోతే అస్సాంలో మరింత బలహీనపడుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular