Homeఎంటర్టైన్మెంట్iBomma Ravi Tweet Controversy: స్టార్ హీరో పై 'iBomma' రవి సెటైర్లు.. సంచలనం రేపుతున్న...

iBomma Ravi Tweet Controversy: స్టార్ హీరో పై ‘iBomma’ రవి సెటైర్లు.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ ట్వీట్!

iBomma Ravi Tweet Controversy: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో బాగా వినిపించిన పేరు ‘iBomma’ రవి. కొత్త సినిమాలను విడుదలైన రోజే HD ప్రింట్ తో పైరసీ చేసి, సినీ ఇండస్ట్రీ కి చెందిన నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఇతన్ని, పోలీసులు అదుపులోకి తీసుకొని కొన్ని నెలల పాటు విచారించడం, రీసెంట్ గానే ఇతను బెయిల్ మీద రిలీజ్ అవ్వడం వంటివి జరిగాయి. అయితే బయటకు వచ్చిన తర్వాత […]

iBomma Ravi Tweet Controversy: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో బాగా వినిపించిన పేరు ‘iBomma’ రవి. కొత్త సినిమాలను విడుదలైన రోజే HD ప్రింట్ తో పైరసీ చేసి, సినీ ఇండస్ట్రీ కి చెందిన నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఇతన్ని, పోలీసులు అదుపులోకి తీసుకొని కొన్ని నెలల పాటు విచారించడం, రీసెంట్ గానే ఇతను బెయిల్ మీద రిలీజ్ అవ్వడం వంటివి జరిగాయి. అయితే బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి ప్రెస్ మీట్ కానీ, మీడియా తో మాట్లాడడం వంటివి కానీ చెయ్యని రవి, రీసెంట్ గా సోషల్ మీడియా లో దర్శనమిచ్చాడు. ఇది ఆయన అధికారిక ట్విట్టర్ అకౌంట్ , కాదా అనేది పక్కన పెడితే , ఆ అకౌంట్ నుండి వచ్చిన ట్వీట్ మాత్రం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇంతకీ ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం.

ఆయన మాట్లాడుతూ ‘డైరెక్టర్స్ ని ఇంటికి పిలవడం, ఒక సినిమా తీయండి అని బ్రతిమిలాడడం, దండం అయ్యా నీకు ‘ అంటూ ఒక ట్వీట్ వేసాడు. ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి వేసాడు?, చిరంజీవి ని ఉద్దేశించి వేసాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్ చేస్తుంటే, ఇలాంటి అలవాటు బాలయ్య కి , ఎన్టీఆర్ కి మాత్రమే ఉంది అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఇద్దరు హీరోల అభిమానులు ఈ ట్వీట్ ని క్వాట్ చేస్తూ కామెంట్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మరి ‘iBomma’ రవి ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసాడు అనేది మాత్రం ఆయన స్వయంగా చెప్తేనే తెలుస్తుంది. అయితే రవి ని అరెస్ట్ చేసిన తర్వాత పైరసీ నెట్ వర్క్ మొత్తాన్ని మూసేయొచ్చు, ఇక సినీ ఇండస్ట్రీ కి మంచి రోజులు వచ్చాయని సినీ ప్రముఖులు మొత్తం బలంగా నమ్మారు.

కానీ అలాంటిదేమి జరగలేదు. ఇప్పటికీ పైరసీ జరుగుతూనే ఉంది. రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘, ‘ధురంధర్ 2’ వంటి చిత్రాలను కూడా పైరసీ చేసి HD ప్రింట్ ఆన్లైన్ లో వదిలారు. మరి ఇన్ని రోజులు రవి ని జైలు లో పెట్టుకొని ఏమి ఉపయోగమో అర్థం కావడం లేదని అంటున్నారు సినీ పెద్దలు. రాబోయే రోజుల్లో అయినా దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper