spot_img
Homeఆంధ్రప్రదేశ్‌జగన్ అప్పులు.. వడ్డీల భారం వచ్చేవారిదే..

జగన్ అప్పులు.. వడ్డీల భారం వచ్చేవారిదే..

Jagan Debtsఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. నెలనెలా అప్పుల భారం పెరిగిపోతోంది. వడ్డీలతో కుదేలైపోతోంది. ఏఢు శాతం వడ్డీతో ప్రతి మంగళవారం ఆర్బీఐ వద్ద అప్పు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ పరిస్థితిపై నిపుణులు సైతం నివ్వెరపోతున్నారు. అప్పు తిరిగి చెల్లించే వాడికే భయం ఉంటుంది. కానీ తిరిగి చెల్లించే ఉద్దేశం లేని వాడికి అప్పు ఎంతైనా ఫర్వాలేదని ఏపీని చూస్తే తెలుస్తుంది.

ఇంత కాలం వడ్డీలకు తెచ్చి కాలం నెట్టుకొస్తున్న ప్రభుత్వానికి ఇంకా మూడేళ్లు గడవాలంటే గగనమే అని చెబుతున్నారు పరిశీలకులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తోంది. కొద్ది వారాలుగా వడ్డీ గురించి ఆలోచన చేయకుండా గొప్పల కోసమైనా అప్పులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంస్థలు ప్రభుత్వానికి అప్పు ఇవ్వడానికి జంకుతున్నాయి. గ్యారంటీ ఇస్తామన్నా నమ్మడం లేదు.

దీంతో ఆర్బీఐ కూడా వెనక్కి తగ్గుతోంది. ఈ వారం తీసుకున్న అప్పుతో వచ్చే డిసెంబర్ వరకు తీసుకోవాల్సిన రుణ పరిమితి దాదాపుగా అయిపోయిందని తెలుస్తోంది. అందుకే మరింత అప్పులు తీసుకునేందుకు అవకాశం కల్పించాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. మినహాయించిన అప్పుల మొత్తం మళ్లీ తమకు కేటాయించాలని కోరుతోంది.

ఏపీ సర్కారు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోవడం ఖాయమని చెబుతున్నారు. వేతనాలు,పింఛన్లు పంపిణీ చేయడానికి కూడా వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడుంది. అప్పుల వల్ల ఎఢాపెడా వాయిదాలు చెల్లించే భారం పెరుగుతుంది. ఆర్బీఐ ముందుగానే మినహాయించుకుంటుంది. దీంతో జీతాలు చెల్లించేందుకు కూడా కష్టాలు పడాల్సి వస్తోంది. ఏపీ సర్కారుకు ఇది మరింతగా ఇబ్బంది పెట్టే అంశంగా మారుతోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...
Oktelugu Epaper