Homeజాతీయ వార్తలుCM Vijay political challenges: తమిళ సీఎం విజయ్ కి మరో ఇబ్బంది.. ఈ గండాన్ని...

CM Vijay political challenges: తమిళ సీఎం విజయ్ కి మరో ఇబ్బంది.. ఈ గండాన్ని ఎలా దాటుతాడో ..

CM Vijay political challenges: తమిళ ముఖ్యమంత్రి విజయ్ కి సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ప్రతిదీ కూడా ఒక పరమపద సోపానం లాగా మారిపోయింది. ప్రతి సమస్యను ఆయన పరిష్కరించుకుంటూ వస్తున్న విధానం గొప్పగానే ఉన్నప్పటికీ.. ఆయన సమస్యలు ఎదుర్కొంటున్న తీరు మాత్రం టీ వీ కే కార్యకర్తలకు ఏమాత్రం రుచించడం లేదు. ఇటీవల కోయంబత్తూరు వ్యవహారంలో విజయ్ ప్రభుత్వం మీద […]

CM Vijay political challenges: తమిళ ముఖ్యమంత్రి విజయ్ కి సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ప్రతిదీ కూడా ఒక పరమపద సోపానం లాగా మారిపోయింది. ప్రతి సమస్యను ఆయన పరిష్కరించుకుంటూ వస్తున్న విధానం గొప్పగానే ఉన్నప్పటికీ.. ఆయన సమస్యలు ఎదుర్కొంటున్న తీరు మాత్రం టీ వీ కే కార్యకర్తలకు ఏమాత్రం రుచించడం లేదు.

ఇటీవల కోయంబత్తూరు వ్యవహారంలో విజయ్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది డీఎంకే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన విజయ్ ఐపిఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. దీంతో ఆ సమస్య నుంచి బయటపడగలిగారు. దాన్ని మర్చిపోకముందే ఇప్పుడు మరొక సమస్య విజయ్ ముందు నిలిచింది.. దీంతో ఆయన ఏం చేస్తారు అనేది ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది.

తమిళనాడు రాష్ట్రంలో కావేరి నది జలాల వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కావేరి నదికి మధ్య భాగంలో మేఘ ధాతు ప్రాంతం వద్ద కర్ణాటక రాష్ట్రం ఒక రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.. దీనిని తప్పుపడుతూ తమిళనాడులో ఉన్న అన్ని పార్టీలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే కర్ణాటక వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎండిఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక తీరు సరికాదని మండిపడ్డారు.

ఆ ప్రాజెక్టును నిర్మిస్తామని ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ వ్యాఖ్యానించారు. కర్ణాటక ప్రభుత్వం మొండిగా వెళుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకూడదని అన్ని రాజకీయ పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి.. ఈ నిరసనలో అన్ని రాజకీయ పార్టీలు.. రైతు సంఘాలు పాల్గొన్నాయి.

ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కర్ణాటక ప్రభుత్వం ఏకంగా 5900 కోట్ల రూపాయలను కేటాయించింది. 68 టీఎంసీ ల నీరు నిల్వ చేసే విధంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. సుప్రీంకోర్టు, కావేరి నీటి నిర్వహణ బోర్డు ఉత్తర్వులను కర్ణాటక ప్రభుత్వం కాల రాస్తోందని తమిళనాడు నేతలు ఆరోపిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టు వల్ల మెట్టూరు ప్రాంతానికి నేటి ప్రవాహం తగ్గుతుందని.. కావేరి నీటి మీద ఆధారపడిన జిల్లాల మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటాయని తమిళ రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని ఎలా విజయ్ పరిష్కరిస్తారు.. కర్ణాటక ప్రభుత్వం మీద ఎలా ఒత్తిడి తీసుకొస్తారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper