Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan YSR incident truth: ఆస్పత్రిలో ఆపరేషన్ లో ఉండగా వైఎస్ఆర్ బెదిరించాడు.. బెదరలా.....

Pawan Kalyan YSR incident truth: ఆస్పత్రిలో ఆపరేషన్ లో ఉండగా వైఎస్ఆర్ బెదిరించాడు.. బెదరలా.. అసలు నిజం చెప్పిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan YSR incident truth: గచ్చిబౌలిలో నిర్వహించే సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ ఉపయోగం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ ఆలోచించుకున్నారు. తన ఇంటి దగ్గర నుంచే విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడడం మొదలుపెట్టారు. సహజంగానే ఆవేశపూరితమైన వ్యక్తిత్వంతో కనిపించే పవన్ కళ్యాణ్.. చాలా లోతైన విషయాలు మాట్లాడారు. ఇన్ని రోజులపాటు తన మీద వస్తున్న ఆరోపణలకు అత్యంత ఘాటు భాషలో సమాధానం ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ కు సమాజ సేవ అంటే చాలా ఇష్టం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలను ఆయన చాలావరకు పరిష్కరించారు. చాలామందికి ఆయన సహాయం కూడా చేశారు. ఈ విషయాలను ఆయన స్వయంగా చెప్పుకోలేదు. కొంతమంది వ్యక్తుల ద్వారా అది కూడా చాలా కాలం తర్వాత బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ఏపీ రాష్ట్రంలో పర్యావరణ శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. తన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న పనులను వేగంగా పూర్తి చేస్తూనే.. పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమల యాజమాన్యాలకు చుక్కలు చూపిస్తున్నారు.. ముక్కు సూటి స్వభావాన్ని కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ ఏ విషయమైనా సరే ఓపెన్ గానే చెబుతారు. జూబ్లీహిల్స్ లో తన ఇంటి వద్ద జరుగుతున్న విలేకరుల సమావేశంలో కూడా తన రాజకీయ ప్రవేశం గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

చాలాకాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడారు. బహుశా తెలంగాణ నేతలు తన మీద చేస్తున్న ఆరోపణలకు ఈ విధంగా కౌంటర్ ఇవ్వడానికి ఆయన ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం అంత ఈజీగా జరగలేదు. బాలు సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత.. 2005 -06 కాలంలో ఆయనకు అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్నారు.. ఒక పోలీసు అధికారి ఆయన దగ్గరికి వచ్చారు..

“మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా.. మిమ్మల్ని వదిలిపెట్టారు. మీ అన్నయ్యగారు ఏమైనా పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం ఉందా.. ఆయనను కూడా వదిలిపెట్టరు. కేసులు పెడతారు.. రకరకాలుగా ఇబ్బందులు పెడతారు.. జాగ్రత్త” అంటూ ఆ పోలీసు అధికారి పవన్ కళ్యాణ్తో చెప్పారు.. దానికి పవన్ కళ్యాణ్ “లేదు సార్ మేము రాజకీయాల్లోకి ఎందుకు వస్తాం. రాజకీయాలలోకి రావాల్సిన అవసరం మాకు ఏముంది” అని బదులిచ్చారు. “లేదు లేదు మీరు చూస్తూ ఉండండి.. మీరు రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా చంపేస్తారు అని” ఆ పోలీసు అధికారి పవన్ కళ్యాణ్ తో చెప్పారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్నారు. ఇప్పుడైతే చంపేస్తారు అనే మాట పవన్ కళ్యాణ్ కు వినిపించిందో ఆయన అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత తన సోదరుడితో ఈ విషయాలను చెప్పుకొని బాధపడ్డారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రజారాజ్యం పార్టీ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. చిరంజీవి అధికారంలోకి రాలేకపోయినప్పటికీ.. ముఖ్యమంత్రి కలను సాకారం చేసుకోలేకపోయినప్పటికీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మాత్రం తనకంటూ ఒక మార్క్ సృష్టించుకున్నారు.
https://x.com/i/broadcasts/1wxWjjmRjQjJQ

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular