Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi IPL insights: ఐపీఎల్ ద్వారా ఇలా కూడా సంపాదించవచ్చా.. వైభవ్ సూర్య వంశీ...

Vaibhav Suryavanshi IPL insights: ఐపీఎల్ ద్వారా ఇలా కూడా సంపాదించవచ్చా.. వైభవ్ సూర్య వంశీ భలే పాఠాలు చెప్పాడుగా..

Vaibhav Suryavanshi IPL: ఐపీఎల్ అంటేనే కమర్షియల్ గేమ్. ఇందులో ఆడేవాడికి డబ్బే డబ్బు. అలాంటి ప్లేయర్ల మీద కోట్లు కుమ్మరించడానికి కంపెనీలు వెనుకాడవు. ప్రకటనలు.. ఒప్పందాలు.. ఇంకా అనేక రకాల వ్యవహారాలతో ఆటగాళ్లు దండిగానే సంపాదిస్తారు. ఈసారి ఐపీఎల్ లో మాత్రం 15 సంవత్సరాల బుడ్డోడు.. గొప్ప గొప్ప ప్లేయర్లను కాదని గట్టిగా సంపాదించాడు. అతడు మరెవరో కాదు వైభవ్ సూర్య వంశీ. సూర్య వంశీ ఇటీవలీ ఐపీఎల్ లో సంచలన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. […]

Vaibhav Suryavanshi IPL: ఐపీఎల్ అంటేనే కమర్షియల్ గేమ్. ఇందులో ఆడేవాడికి డబ్బే డబ్బు. అలాంటి ప్లేయర్ల మీద కోట్లు కుమ్మరించడానికి కంపెనీలు వెనుకాడవు. ప్రకటనలు.. ఒప్పందాలు.. ఇంకా అనేక రకాల వ్యవహారాలతో ఆటగాళ్లు దండిగానే సంపాదిస్తారు. ఈసారి ఐపీఎల్ లో మాత్రం 15 సంవత్సరాల బుడ్డోడు.. గొప్ప గొప్ప ప్లేయర్లను కాదని గట్టిగా సంపాదించాడు. అతడు మరెవరో కాదు వైభవ్ సూర్య వంశీ.

సూర్య వంశీ ఇటీవలీ ఐపీఎల్ లో సంచలన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. ఆట ద్వారా మాత్రమే కాకుండా ఆదాయంలో కూడా సత్తా చూపించాడు. ఈ సీజన్లో అతడు రి టెన్షన్ కింద రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి 1.1 కోట్లు స్వీకరించాడు. మ్యాచ్ ఫీజుగా 7.5(ఒక్కో మ్యాచ్) లు తీసుకున్నాడు. తద్వారా 1.20 కోట్లు అతనికి దక్కాయి. తన ప్రదర్శనతో మోస్ట్ వ్యాల్యుడు ప్లేయర్ గా 15 లక్షలు సొంతం చేసుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ ద్వారా 10 లక్షలు దక్కించుకున్నాడు. సూపర్ స్ట్రైకర్ ద్వారా 10 లక్షలు + 20 లక్షలు+ ఒక కారు తక్కించుకున్నాడు. అత్యధిక సిక్సర్లు కొట్టడం ద్వారా పది లక్షలు సంపాదించాడు. ఎమర్జింగ్ ప్లేయర్ పురస్కారం ద్వారా 10 లక్షలు సొంతం చేసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. ఇతర పురస్కారాలు కలుపుకొని మొత్తంగా అతడు 3.10 కోట్లు సంపాదించాడు.

ఐపీఎల్ లో ఒక అన్ క్యాప్డ్ ఆటగాడు ఈ స్థాయిలో సంపాదించడం మామూలు విషయం కాదు. ఇదంతా కూడా ఒక రోజులోనే రాలేదు. సూర్య వంశీ తన సూపర్ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. దీనికోసం విపరీతంగా ప్రాక్టీస్ చేశాడు. క్రికెట్ మాత్రమే లోకంగా బతికాడు. బంతిని గట్టిగా కొట్టడం మాత్రమే కాదు.. సమర్థవంతంగా ఎలా ఆడాలో కూడా చూపించాడు. అందువల్లే అతడు అత్యంత విలువైన ఆటగాడిగా మారిపోయాడు. ఇప్పుడే అతడు ఐపీఎల్లో తన ప్రస్థానం మొదలుపెట్టాడు. ఇకముందు విధ్వంసాల మీద విధ్వంసాలు సృష్టించబోతాడు. అతని కోసం రాజస్థాన్ రాయల్స్ ఎంతైనా ఖర్చు చేస్తుంది. ఎన్ని కోట్లయినా సరే ఇచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే సూర్యవంశీ కేవలం ఇప్పుడు ఒక ఆటగాడు మాత్రమే కాదు.. అంతకుమించిన బ్రాండ్ కూడా..

మొదట్లో అతడి ఆట దూకుడుగా సాగేది. ఆ తర్వాత దూకుడు తనంతో పాటు సమర్థత కూడా దానికి జత కలిసేది. అందువల్లే అతడు ఈ స్థాయిలో ఆడుతున్నాడు. పరుగుల వరద బ్రహ్మాండంగా పారిస్తూ ఉన్నాడు. సూర్య వంశీ ఆడుతున్న తీరు ఆకట్టుకుంటుంది. అతడు ఇదే జోరు కనక చూపిస్తే.. ఐపీఎల్ చరిత్రలో మరింత విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper