Al Falah University: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలిన బాంబు మనదేశంలో ఉన్న ఉగ్రవాదుల అందర్నీ పట్టిస్తోంది. ఇప్పటికే ఈ సంఘటనలో ముగ్గురు డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.. మంగళ వారం అదుపులోకి తీసుకున్న ముగ్గురు డాక్టర్లు హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఫరీదాబాద్ ప్రాంతంలోని ఆల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు.
పోలీసులు అరెస్ట్ చేసిన వైద్యులలో డాక్టర్ ముజామిల్ షకీల్, డాక్టర్ షాహిన్ షాహిద్, డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఉన్నారు. ఇందులో ఉమర్, ముజామిల్ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన వారు. షహీన్ లక్నోకు చెందిన వ్యక్తి. వీరంతా కూడా ఫరీదాబాద్ ఆసుపత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. ఆల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో పని చేస్తూ దౌజా అనే గ్రామంలో షకీల్ రెండు ఇండ్లను అద్దెకు తీసుకున్నాడు. అందులో మూడు టన్నుల పేలుడు పదార్థాలను నిల్వ చేసాడు.. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు..
జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ వైట్ మాడ్యూల్ లో ఉగ్రవాదులను తయారు చేస్తోంది. డాక్టర్లను, విద్యార్థులను ఉగ్రవాదులుగా మార్చుతోంది. ఈ విభాగానికి డాక్టర్ షహీన నాయకత్వం వహిస్తున్నారు.. అందువల్లే ఆ యూనివర్సిటీలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కాలేజీలో చదువుతున్న చాలామంది వైద్య విద్యార్థులు ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలకు ఆకర్షితులవుతున్నారని ఇంటలిజెన్స్ రిపోర్టు ఇటీవల పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు ఈ విశ్వవిద్యాలయం పై దృష్టి సారించారు. ఫలితంగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. ఇంటెలిజెన్స్ వర్గాలు.. నిఘా వర్గాలు ఈ విశ్వవిద్యాలయం లో చదివిన పాత విద్యార్థుల వివరాలు కూడా సేకరించాయి. అందులో కేసులు ఉన్న వారి వివరాలు కూడా పరిశీలించి.. వారి గురించి ఆరా తీస్తున్నాయి.
ఈ విశ్వవిద్యాలయం వైద్యుల ఫ్యాక్టరీ మాదిరిగా ఉండేది. ఇక్కడ చదువుకున్న వారంతా దేశ విదేశాలలో స్థిరపడ్డారు. ఈ ప్రాంతానికి విశేషమైన పేరు తీసుకొచ్చారు. కానీ కొంతకాలంగా ఈ విశ్వవిద్యాలయంలో పరిస్థితి దారుణంగా మారుతోంది.. కొంతమంది వ్యక్తులు ఇక్కడ వైద్య విద్య పేరుతో ప్రవేశం పొంది దారుణమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కొంతమంది విద్యార్థులను ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టడానికి ఎంపిక చేసుకుంటున్నారు. వారి ద్వారా దారుణమైన పనులు చేయిస్తున్నారు. చివరికి వారి ప్రాణాలను గాలిలో కలిసేలా చేస్తున్నారు. ఆత్మహుతి దళాలుగా కూడా పనిచేసేలా శిక్షణ ఇస్తున్నారు. చివరికి వారి కుటుంబాలను కూడా అన్యాయం చేస్తున్నారు.