Homeజాతీయ వార్తలుAjit Doval Saudi Arabia visit: సౌదీలో అజిత్‌ దోవల్‌.. ఆకస్మిక పర్యటన వెనుక భారీ...

Ajit Doval Saudi Arabia visit: సౌదీలో అజిత్‌ దోవల్‌.. ఆకస్మిక పర్యటన వెనుక భారీ వ్యూహం!

Ajit Doval Saudi Arabia visit: గల్ఫ్‌ ఉద్రిక్తతలు పూర్తిగా చల్లారలేదు. ఇరాన్‌–అమెరికా మధ్య సీజ్‌ఫైర్‌ కొనసాగుతోంది. అమెరికాకు మద్దతు ఇస్తున్న గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ వైమానిక దాడులు చేసింది. తీవ్రంగా నష్టం కలిగించింది. తాజాగా భారత నౌకలపై ఇరాన్‌ కాల్పులు జరిపింది. ఈ నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ సౌదీ అరేబియాలో ఆకస్మికంగా పర్యటించారు. ఇరాన్‌ కాల్పుల ఘటన తర్వాత దోవల్‌ పర్యటన చర్చనీయాంశంగా మారింది. దోవల్‌ సౌదీ పర్యటన నేపథ్యం […]

Ajit Doval Saudi Arabia visit: గల్ఫ్‌ ఉద్రిక్తతలు పూర్తిగా చల్లారలేదు. ఇరాన్‌–అమెరికా మధ్య సీజ్‌ఫైర్‌ కొనసాగుతోంది. అమెరికాకు మద్దతు ఇస్తున్న గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ వైమానిక దాడులు చేసింది. తీవ్రంగా నష్టం కలిగించింది. తాజాగా భారత నౌకలపై ఇరాన్‌ కాల్పులు జరిపింది. ఈ నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ సౌదీ అరేబియాలో ఆకస్మికంగా పర్యటించారు. ఇరాన్‌ కాల్పుల ఘటన తర్వాత దోవల్‌ పర్యటన చర్చనీయాంశంగా మారింది.

దోవల్‌ సౌదీ పర్యటన నేపథ్యం
జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ఏప్రిల్‌ 19న సౌదీ అరేబియాకు అధికారికంగా వెళ్లి, జాతీయ భద్రతా సలహాదారు మోయిద్‌ అల్‌ అల్బా, ఇంధన మంత్రి, విదేశాంగ మంత్రితో కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశాలు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భద్రత, ఇంధన సరఫరా మార్గాలపై కేంద్రీకరించబడ్డాయి. గల్ఫ్‌ యుద్ధం, హర్మూజ్‌ దిగ్భందనం సమయంలో ఈ పర్యటన చర్చనీయాంశమైంది,

భారత నౌకలపై ఇరాన్‌ దాడి..
ఏప్రిల్‌ 18న హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఇరాన్‌ ఐఆర్‌జీసీ గన్‌ బోట్లు 2 మిలియన్‌ బ్యారెళ్ల చమురు రవాణా చేస్తున్న భారత నౌకలపై కాల్పులు జరిపాయి. ఇది ఒమన్‌ ఈశాన్యంగా 20 నాటికల్‌ మైళ్ల దూరంలో జరిగింది, ట్యాంకర్‌ ట్రాకర్‌ ఆడియో క్లిప్‌ విడుదల చేసింది. ప్రాణ నష్టం లేకపోయినా, భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చింది. ఇరాన్‌ తక్షణమే అలర్ట్‌ అయి, పునరావృతం కాదని హామీ ఇచ్చింది.

ప్రాంతీయ ఉద్రిక్తత..
ఇరాన్‌ ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలు, చమురు సంస్థలు, హెజ్బుల్లా, హౌతీలు, డ్రోన్‌ దాడులతో హారిజాంటల్‌ ఎస్కలేషన్‌ చేస్తోంది. హర్మూజ్‌ మూసివేస్తూ ప్రపంచ చమురు రవాణాను ప్రభావితం చేస్తోంది, భారత్‌లో ఇంధన ధరల పెరుగుదలకు దారితీసింది. అమెరికా దిగ్భందన ప్రకటనలు ఉద్రిక్తతను మరింత పెంచాయి.

ఇంధన భద్రత.. భారతీయుల రక్షణపై చర్చలు..
దోవల్‌ సమావేశాల్లో గల్ఫ్‌ శాంతి, హర్మూజ్‌ మార్గాలు, భారత్‌ చమురు దిగుమతి (సౌదీ టాప్‌–3 సరఫరాదారు), ప్రత్యామ్నాయ మార్గాలు, గల్ఫ్‌లో భారతీయ సిబ్బంది (కోటి మంది), గల్ఫ్‌ ఫోర్స్‌ భద్రతపై చర్చించారు. ఇరాన్‌ దుస్సాహసాలకు ఎదుర్కొనేలా భారత్‌ ఆస్తుల రక్షణ, సీజ్‌ సామర్థ్యం సందేశం ఇచ్చారు.

ఈ పర్యటన ఇరాన్‌పై దౌత్య ఒత్తిడి, సౌదీతో భాగస్వామ్యాన్ని పెంచే వ్యూహం. గల్ఫ్‌ యుద్ధంలో భారత్‌ హోర్ముజ్‌ దాడి తప్పును ఉపయోగించి, ఇంధన భద్రతను రక్షించుకుంది. ఇది ప్రాంతీయ స్థిరత్వానికి భారత్‌ కీలక పాత్రను నొక్కి చెబుతుంది, రాబోయే రోజుల్లో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper