Homeఎంటర్టైన్మెంట్Allu Arjun new house in Hyderabad: హైదరాబాద్ లో మరో ఇంద్రభవనం లాంటి ఇంటిని...

Allu Arjun new house in Hyderabad: హైదరాబాద్ లో మరో ఇంద్రభవనం లాంటి ఇంటిని నిర్మించుకున్న అల్లు అర్జున్.. బడ్జెట్ ఎంతో తెలుసా..

Allu Arjun new house in Hyderabad: గత రెండు మూడు రోజులుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) హైదరాబాద్ నుండి ముంబై కి షిఫ్ట్ అవ్వబోతున్నాడని , ఇక నుండి ఆయన అక్కడే ఉంటదంటూ సోషల్ మీడియా లో అనేక ప్రచారాలు సాగిన సంగతి తెలిసిందే. ఈ వార్త బాగా వైరల్ అవ్వడం తో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ దీనిపై క్లారిటీ ఇస్తూ , ‘రాకా’ షూటింగ్ కోసం […]

Allu Arjun new house in Hyderabad: గత రెండు మూడు రోజులుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) హైదరాబాద్ నుండి ముంబై కి షిఫ్ట్ అవ్వబోతున్నాడని , ఇక నుండి ఆయన అక్కడే ఉంటదంటూ సోషల్ మీడియా లో అనేక ప్రచారాలు సాగిన సంగతి తెలిసిందే. ఈ వార్త బాగా వైరల్ అవ్వడం తో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ దీనిపై క్లారిటీ ఇస్తూ , ‘రాకా’ షూటింగ్ కోసం ముంబై లో ఒక లగ్జరీ ఇంటిని అద్దెకు తీసుకున్న విషయం వాస్తవమే కానీ , అక్కడికి పూర్తిగా షిఫ్ట్ అవుతున్నాడు అంటూ వరుణ్ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశాడు. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సమీపం లోనే జూబ్లీ హిల్స్ లో ఇంద్ర భవనం లాంటి ఇంటిని నిర్మిస్తున్నాడట.

ఈ ఇంటి నిర్మాణం కోసం ఆయన ఏకంగా 80 కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ తో ఈ ఇంటి నిర్మాణం జరుగుతుందని , హైదరాబాద్ లో ఉన్న సెలబ్రిటీలందరి ఇళ్లకంటే ఎంతో లావిష్ గా ఈ ఇల్లు ఉంటుందని అంటున్నారు. ఈ ఏడాది లోనే అల్లు అర్జున్ ఈ ఇంట్లోకి గృహ ప్రవేశం చేయబోతున్నట్టు టాక్. అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్, సోదరుడు అల్లు శిరీష్ కుటుంబం కూడా ఈ ఇంటికి షిఫ్ట్ అవ్వబోతున్నారు అట. ఈ వార్త నేడు ఉదయం నుండి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఏమి చేయబోతున్నారు?, ఎవరికైనా అద్దెకు ఇస్తారా ?, లేకపోతే ఈ ఇంటిని కూడా వాడుకుంటారా అనేది తెలియాలి. ఈ ఇంటిని అల్లు అర్జున్ అలా వైకుంఠపురం లో సమయం లో కట్టించాడు.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ద్రుష్టి మొత్తం ‘రాకా’ మూవీ మీదనే ఉంది. ఈ ఏడాది లోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా అయిపోగానే ఆయన లోకేష్ కనకరాజ్ తో చేయబోయే సినిమాకు షిఫ్ట్ అవ్వబోతున్నాడు . ‘రాకా’ చిత్రాన్ని ఎట్టి పరిస్థితి లోనూ వచ్చే ఏడాది సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని చూస్తున్నారు మేకర్స్. లోకేష్ కనకరాజ్ మూవీ ని వచ్చే ఏడాదే విడుదల చెయ్యాలని చూస్తున్నారు. అంటే వచ్చే ఏడాదిలో అల్లు అర్జున్ నుండి రెండు సినిమాలు రాబోతున్నాయి అన్నమాట. 2026 టాలీవుడ్ కి ఎంత గడ్డు కాలం గా మారిందో, 2027 వ సంవత్సరం టాలీవుడ్ కి గోల్డెన్ ఇయర్ లాగా మారబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper