Homeజాతీయ వార్తలుAIADMK internal conflicts: ఇవి నాటి జయ రోజులు కావు.. అన్నా డీఎంకే చీలికలు.. పీలికలు

AIADMK internal conflicts: ఇవి నాటి జయ రోజులు కావు.. అన్నా డీఎంకే చీలికలు.. పీలికలు

AIADMK internal conflicts: చుక్కాని లేని నావ.. ఎటు ప్రయాణిస్తుందో తెలియదు. ఎక్కడ మునిగిపోతుందో కూడా తెలియదు. అందుకే దారి, దిశ లేని గమ్యం ఎప్పటికీ ప్రమాదకరమే. ఇప్పుడు తమిళనాడులోని అన్నాడీఎంకెలో పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఎమ్మెల్యేలు వర్గాలుగా విడిపోయారు. పార్టీని నిర్దేశించేవారు లేకుండా పోయారు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఎవరు ఉంటారో అర్థం కావడం లేదు. పరిస్థితులు ఇలానే ఉంటే.. అన్నా డీఎంకే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం . జయలలిత బతికి ఉన్నప్పుడు […]

AIADMK internal conflicts: చుక్కాని లేని నావ.. ఎటు ప్రయాణిస్తుందో తెలియదు. ఎక్కడ మునిగిపోతుందో కూడా తెలియదు. అందుకే దారి, దిశ లేని గమ్యం ఎప్పటికీ ప్రమాదకరమే. ఇప్పుడు తమిళనాడులోని అన్నాడీఎంకెలో పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఎమ్మెల్యేలు వర్గాలుగా విడిపోయారు. పార్టీని నిర్దేశించేవారు లేకుండా పోయారు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఎవరు ఉంటారో అర్థం కావడం లేదు. పరిస్థితులు ఇలానే ఉంటే.. అన్నా డీఎంకే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం .

జయలలిత బతికి ఉన్నప్పుడు అన్నా డీఎంకే లో క్రమశిక్షణ అద్భుతంగా ఉండేది. నాయకులు మాట దాటేవారు కాదు. పైగా అసంతృప్తికి అవకాశం ఇచ్చేవారు కాదు. జయలలిత కన్ను మూసిన తర్వాత పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎవరు పార్టీని నిర్దేశిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటికే అధికారానికి దూరమై అన్న డిఎంకె పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఇప్పుడు తమిళనాడులో టీ వీకే అధికారంలోకి రావడంతో అన్నాడీఎంకె పరిస్థితి దారుణంగా మారింది.

ఇటీవల ఎన్నికల ఫలితాలలో ప్రతిపక్ష హోదాను అన్నాడీఎంకే కోల్పోయింది. దీనికి తోడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎదప్పాడి పలని స్వామి ని శాసనసభ నేతగా ఎన్నుకుంటూ 17 మంది ఎమ్మెల్యేలు ప్రోటెమ్ స్పీకర్ కు లెటర్ రాశారు. జరుగుతుండగానే సీనియర్ నాయకుడు వేలుమని ని శాసనసభ నాయకుడిగా, శన్ముగం ను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకొని, 30 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఇది అన్నాడీఎంకెలో చీలిక ఏర్పడిన కారణమైంది. ఎన్నికల్లో చాలామంది నాయకులు బిజెపితో పొత్తును వ్యతిరేకించారు. టీవీకే తో పొత్తు కుదుర్చుకోవాలని సూచించారు. అయితే పలని స్వామికి వచ్చిన ఒత్తిడి మేరకు ఆయన బిజెపితో జత కట్టడానికి ఆసక్తి చూపించారు. విజయ్ పార్టీ అధికారంలోకి రావడంతో.. అసమ్మతి నాయకులు వేరే కుంపటి పెట్టారు. అన్న డీఎంకే ఎమ్మెల్యేలతో కాకుండా.. వారు వేరుగా కూర్చుంటున్నారు. కనీసం ఫలని స్వామితో మాట్లాడేందుకు కూడా వారు ఆసక్తిని చూపించడం లేదు. అదే కాదు ఆ నాయకులు మొత్తం విజయ్ కి సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతే కాదు ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విజయ్ కి నమస్కరించడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper