Homeజాతీయ వార్తలుSuvendu Adhikari Bangladesh border fencing: మమత తెరిచిన ద్వారాలను ముళ్ళకంచెలతో బిగిస్తున్నాడు సువేందు అధికారి..

Suvendu Adhikari Bangladesh border fencing: మమత తెరిచిన ద్వారాలను ముళ్ళకంచెలతో బిగిస్తున్నాడు సువేందు అధికారి..

Suvendu Adhikari Bangladesh border fencing: బెంగాల్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బిజెపి ఏం చేస్తుందనే ప్రశ్నకు తొలి సమాధానం చెప్పేశాడు బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి. తన రాజకీయ గురువు మమతా బెనర్జీకి ఇప్పటికే షాక్ ల మీద షాక్ లు ఇచ్చిన సువేందు అధికారి.. తాజాగా మరో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేసాడు. ఇప్పటికే ఎమ్మెల్యేగా ఓడిపోయి మమత దీనంగా ఇంట్లో కూర్చుని ఉన్నారు. భవిష్యత్తును తలుచుకుంటూ భయభయంగా గడుపుతున్నారు. ఇప్పటికే చాలామంది టీఎంసీ నేతలు […]

Suvendu Adhikari Bangladesh border fencing: బెంగాల్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బిజెపి ఏం చేస్తుందనే ప్రశ్నకు తొలి సమాధానం చెప్పేశాడు బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి. తన రాజకీయ గురువు మమతా బెనర్జీకి ఇప్పటికే షాక్ ల మీద షాక్ లు ఇచ్చిన సువేందు అధికారి.. తాజాగా మరో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేసాడు.

ఇప్పటికే ఎమ్మెల్యేగా ఓడిపోయి మమత దీనంగా ఇంట్లో కూర్చుని ఉన్నారు. భవిష్యత్తును తలుచుకుంటూ భయభయంగా గడుపుతున్నారు. ఇప్పటికే చాలామంది టీఎంసీ నేతలు బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే అధిష్టానం నుంచి ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. 15 సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న టీఎంసీ.. కార్యకర్తలను కాపాడుకోవడం ఇకపై కష్టమేమో. ఎందుకంటే అధికారాన్ని కోల్పోయిన మరుక్షణమే టీఎంసీ నేతలు కండువాను మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే బిజెపి అంత ఈజీగా వారిని పార్టీలోకి తీసుకొని అవకాశం కనిపించడం లేదు.

వెస్ట్ బెంగాల్లో తొలిసారి గవర్నమెంట్ ని ఏర్పాటు చేసిన బిజెపి.. తన మార్క్ ను చూపించేందుకు సిద్ధమవుతోంది. తొలి క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానమైనది బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం.. దీనికి సంబంధించి భారత సెక్యూరిటీ ఫోర్స్ కు అవసరమైన భూమిని బదిలీ చేయడానికి బెంగాల్ ప్రభుత్వం ఓకే చెప్పింది.. సరిహద్దుల్లో భద్రత.. బంగ్లాదేశ్ ప్రాంతం నుంచి చోరబాట్లను అడ్డుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. భూమి బదిలీ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన మొదలు పెడుతున్నారు. 45 రోజుల్లోనే ఇది పూర్తి చేస్తారు.

భూమి బదిలీ జరిగిన వెంటనే భారత సెక్యూరిటీ ఫోర్స్ రంగంలోకి దిగుతుంది. వెంటనే ఫెన్సింగ్ నిర్మాణం ప్రారంభిస్తుంది. దీనివల్ల అక్రమ చొర బాట్లు ఆగిపోతాయని బెంగాల్ ప్రభుత్వం భావిస్తోంది. బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బంగ్లాదేశ్ విమర్శించింది. భూ కేటాయింపును బంగ్లాదేశ్ తీవ్రంగా తప్పు పట్టింది. ముళ్ళ తీగలకు భయపడేది లేదని స్పష్టం చేసింది. భద్రత విషయంలో భారత్ మానవత దృక్పథంతో ఆలోచించాలని సూచించింది. అయితే భారత్ అంతర్గత రాజకీయాలలో తాము వేలు పెట్టబోమని.. కేంద్రంతో సంబంధాలే తమకు ముఖ్యమని బంగ్లాదేశ్ ప్రకటించింది.. మరోవైపు చొరబాట్లను మాత్రమే తాము అడ్డుకుంటామని ఇప్పటికే కేంద్రం పదేపదే స్పష్టం చేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper