Wife beats husband: ‘లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం’ అని అన్న ఎన్టీఆర్ ఏనాడో తన సినిమా పాటల ద్వారా చెప్పారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారనేది ఈ పాట ఉద్దేశ్యం. అయితే ఇది రానున్న విపరీత పోకడలకు దారితీస్తోంది. పురుషులతో సమానంగా మహిళలు ఉంటే పర్వాలేదు గానీ అచ్చం వాళ్లలాగే ప్రవర్తిస్తామంటేనే అందరికీ కష్టమవుతుంది.

పాశ్చత్య దేశాల్లోని ప్లబ్ కల్చర్, డేటింగ్ కల్చర్ ఇండియాలోకి వచ్చాక పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ధనికుల ఇళ్లల్లో ఉండే మహిళలు వీటికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. పార్టీలు, పబ్బులు, కీర్టీ పార్టీలు అంటూ నానా హంగామా చేస్తుంటారు. ఈ కల్చర్ లో విహారించే మహిళలకు భర్త, పిల్లలు, వగైరా లాంటివి ఏమీ ఉండవు. వాళ్లకు జీవితాన్ని అనుభవించడం మాత్రమే తెలుసు. మిగతావన్నీ నథింగే వాళ్లకు.
ప్రస్తుత కాలంలో పురుషుడు ఒక ఏటీఎం మిషన్ గా మారిపోతున్నాడు. పెళ్లాం అడిగిన డబ్బులు ఇవ్వకుండా వాడు ఒక వేస్టుగాడు అన్నట్లుగా చూసే పెళ్లాలు ఎంతో మంది ఉన్నారు. వీరిమధ్య గొడవలకు డబ్బు ఒక ప్రధాన కారణం అవుతోంది. కుటుంబ కలహాలతో భార్యభర్తలు ఇద్దరు సైకోలుగా మారిపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఇంట్లో ఉండే ఆడవాళ్లను మగవాళ్లు శారీరకంగా, మానసికంగా హింసించడం తరుచూ పేపర్లలో, మన చుట్టూ పక్కలా చూస్తూనే ఉంటాం.
అనుమానం పేరుతో భార్యలను హింసిండం, సైకోలాగా ప్రవర్తించడం, భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని హత్యలు చేయడం నిత్యం న్యూస్ పేపర్లలో కామన్ అయిపోయాయి. ఇది శృతిమించినపుడు భార్యలు తిరిగి భర్తలపై దాడిచేయడం క్షణికావేశంలో హత్య చేయడం వంటి సంఘటనలు అప్పుడప్పుడు కన్పిస్తుంటాయి. కాగా ఓ సైకో భార్య టార్చర్ భరించలేక భర్త తనువు చాలించిన ఘటన తాజాగా చోటుచేసుకుంది.
ఇది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో రుబీనా, ముస్తఫా అనే భార్యభర్తలు ఉండేవారు. వీరికి ఇద్దరు పిల్లలు. అందరింట్లో భర్తలు భార్యలను హింసించే ఘటనలు కన్పిస్తుంటే ఇక్కడ ట్రైన్ రివర్స్ అయింది. భర్త భార్యకు పెళ్లిరోజున అరుంధతిని చూపిస్తే.. ఆ తర్వాతి రోజు నుంచి భార్య భర్తకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది.
భర్త ఆఫీసు నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చినా.. భర్త తన రక్తసంబంధీకులతో మాట్లాడిన దంచుడు ప్రొగ్రాం పెట్టేది. పిల్లలే ముందే తండ్రిని ఆమె చితకబాదడం అలవాటుగా మారిపోయింది. దీంతో ఆ భర్తను భార్య తనను కొట్టాడన్ని సెల్ ఫోన్లో రికార్డు చేసి వాళ్ల బంధువులకు పంపి తన ఆవేదనను చెప్పుకున్నాడు. రోజురోజుకు భార్య వేధింపులు ఎక్కువ కావడంతో ఒకరోజు పురుగుల మందుతాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
వారంరోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది సదరు భర్త అనుకున్నది సాధించాడు. అదేనండి మృత్యుఒడిలోకి వెళ్లాడు. భర్త మృతి తర్వాత అతడి సెల్ ఫోన్లో భార్య అతడిని కొడుతున్న వీడియో ఉండటంతో భర్త బంధువులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. దీంతో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన చూసిన వారంతా ట్రైన్స్ రివర్స్ అయిందంటే ఇదేనేమోనని కామెంట్స్ చేస్తుండం విశేషం.