spot_img
Homeపండుగ వైభవంమృగశిర కార్తె రోజు చేపలు తినడానికి కారణమేంటో మీకు తెలుసా..?

మృగశిర కార్తె రోజు చేపలు తినడానికి కారణమేంటో మీకు తెలుసా..?

మృగశిర కార్తె నేటి నుంచి ప్రారంభమవుతుందనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మృగశిర కార్తె రోజున చాలామంది చేపలను ఎంతో ఇష్టంగా తింటారు. ఈరోజు చేపలను తినడం వెనుక ఆరోగ్య రహస్యం కుడా ఉంది. రోహిణి కార్తె తర్వాత వచ్చే మృగశిర కార్తెలో నైరుతి రుతుపవనాలు వస్తాయి కాబట్టి వాతావరణం చల్లగా ఉంటుంది. మృగశిర కార్తెలో ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకోవడం వల్ల చెడు సూక్ష్మక్రిములు పునరుత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది.

ప్రకృతిలో చోటు చేసుకునే మార్పుల వల్ల చాలామంది దగ్గు, జలుబు, జ్వరం, ఇతర శ్వాస సంబంధిత వ్యాధులతో బాధ పడుతూ ఉంటారు. మృగశిర కార్తె రోజు చేపలు తినడం ద్వారా ఈ ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. మృగశిర కార్తె సమయంలో చేపలు తింటే మంచిదని శాస్త్రీయంగా సైతం నీరూపించబడటం గమనార్హం. మృగశిర కార్తెలో చేపలు తింటే గుండె జబ్బులు, మధుమేహం, ఆస్తమా సమస్యలు ఉన్నవాళ్లకు మేలు చేకూరుతుంది.

మన పూర్వీకుల నుంచి మృగశిర కార్తెలో చేపలు తినడం ఆనాదిగా వస్తుండటం గమనార్హం. చేపలు తినడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. చేపల ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం, పాస్పరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌, ఇతర ఖనిజాలు లభిస్తాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా చేపలను తినవచ్చు. చేపలలో ఉండే కొవ్వు శరీరంలో ఉన్న రక్తపీడనంపై ప్రభావం చూపుతుంది.

చేపలు జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. చేపల ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు కూడా లభిస్తాయి. చేపలను ఇంగువ, చింత చిగురుతో కలిపి వండుకుని తింటే మంచిదని నిపుణులు చెబుతుండటం గమనార్హం.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Vijaya Sai Reddy

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం...
Oktelugu Epaper