Lord Shiva Miracle: మహా శివుడు అంటే కొందరికి ఎనలేని భక్తి. ప్రతి సోమవారం భోళా శంకరుడుని దర్శించుకోకుండా ఉండలేరు. అలాంటి శివుడు ప్రత్యక్షమైతే ఆ అదృష్టం ఎంత బాగుంటుందో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎన్నో పుణ్యాలు. మరెన్నో తపస్సులు చేస్తే గాని ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఉండదని కొందరు పండితులు చెబుతూ ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని ఓ ఆలయంలో శివుడు కళ్ళు తెరిచాడని.. భక్తులను ఆశీర్వదిస్తున్నాడని ప్రచారం జరిగింది. దీంతో ఈ విషయం తెలిసిన చాలామంది ఇక్కడికి తరలివస్తున్నారు. కొందరు శివుడు కళ్ళు తెరిచాడని.. ఆ దృశ్యం మేము చూసామని అంటూ ఉంటే.. మరికొందరు ఇదంతా క్రియేషన్ అని కొట్టిపారేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే?
తిరుపతి పట్టణంలో గాంధీ నగర్ లో రైల్వే స్టేషన్ సమీపాన ఓ శివాలయం ఉంది. ఇది చూడడానికి చిన్నగానే ఉంటుంది. కానీ శుక్రవారం ఉదయం నుంచి ఈ ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. ఉదయం పూజల సందర్భంగా కొందరు భక్తులు శివుడు కళ్ళు తెరిచాడని చెప్పారు. ఆ తర్వాత మరికొంతమంది ఈ దృశ్యాన్ని చూసామని పేర్కొంటున్నారు. దీంతో మహాశివుడు కళ్ళు తెరిచాడు అంటూ చాలామంది ఇక్కడికి తరలివస్తున్నారు. శివుడు ఎడమ కన్ను తెరిచి చూసి భక్తులను ఆశీర్వదించాడని కొందరు అంటున్నారు.
Also Read: ఈరోజు నుంచి శ్రావణమాసం.. కొత్తగా పెళ్లయిన వారు ఇలా చేస్తే..
అయితే హైందవ పురాణ ప్రకారం మహాశివుడు నిత్యం ధ్యానంలో ఉంటాడు. శివుడు కళ్ళు తెరిస్తే భస్మం అయిపోతారని చెబుతారు. అందులోనూ మూడో కన్ను తెరిస్తే లోకం నాశనం అవుతుందని కొందరు చెబుతూ ఉంటారు. అలాంటిది శివుడు కళ్ళు తెరవడం అసంభవం అని కొందరు చెబుతున్నారు. మరికొందరు చెబుతున్న ప్రకారం శివలింగానికి విభూది ఏర్పాటు చేశారని.. కానీ కళ్ళు తెరిచారని చెబుతూ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట ప్రచారం కావడంతో ఇక్కడికి భక్తుల రాక తీవ్రమైంది. అంతేకాకుండా తిరుపతి క్షేత్రానికి వచ్చిన చాలామంది ఈ శివలింగాన్ని దర్శించుకునేందుకు వస్తున్నారు.
గాంధీనగర్లో ఆటో స్టాండ్ సమీపంలో ఉన్న ఈ ఆలయం రోడ్డుకు ఇబ్బందిగా ఉండడంతో తొలగిస్తామని టీటీడీ గతంలో తెలిపింది. ఇక్కడ గోవిందరాజుల సత్రాలను నిర్మిస్తోంది. అయితే స్థానికుల అనుమతి లేకుండా ఈ ఆలయాన్ని ఏర్పాటు చేశారని… ఇప్పుడు కళ్ళు తెరిచారని ప్రచారం చేస్తున్నారని మరికొందరు వాపోతున్నారు. అయితే భక్తులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా మహాశివుడని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రస్తుత సమాజంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయని.. శివుడు కూడా కళ్ళు తెరవడం కూడా జరుగుతుందని కొందరు అంటున్నారు. భూమిపై దేవుడు ఉన్నాడని నమ్మేందుకు శివుడు ఇలా చేశాడని ఇంకొందరు చెబుతున్నారు.
Also Read: ఈ శ్రావణమాసంలో మటన్ తింటున్నారా?
అయితే ఈ విషయం పై ప్రభుత్వం గానీ.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గాని ఎలా స్పందిస్తుందోనని ఆసక్తిగా చూస్తున్నారు. ఒకవేళ కళ్ళు తెరిచిన విషయం వాస్తవమే అయితే ఎలా నిరూపిస్తారని మరికొందరు చెబుతున్నారు. ఉదయం వచ్చిన భక్తులు మాత్రం శివుడు కళ్ళు తెరిచారని పేర్కొంటున్నారు.