Maha kumbha Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ప్రస్తుతం మహా కుంభమేళా జరుగుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రితో పూర్తి అవుతుంది. అయితే ఈ మహా కుంభమేళాలో స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు దాదాపుగా 57 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానం ఆచరించినట్లు తెలుస్తోంది. అయితే మహా కుంభమేళా పూర్తి అయ్యే సమయం దగ్గర పడుతుండటంతో ఇక్కడికి వెళ్లే భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. అయితే ఇప్పటికే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే మహా కుంభమేళాలో చివరి స్నానం ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి రోజున జరగనుంది. ఈ సమయంలో పుణ్య స్నానం ఆచరిస్తే అన్ని పాపాలు కూడా తొలగిపోయ అంతా పుణ్యం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. దీంతో చాలా మంది చివరి పుణ్య స్నానం ఆచరించడానికి వెళ్తుంటారు. అయితే కుంభమేళాలో చివరి పుణ్య స్నానం ఏ విధంగా ఆచరిస్తే పుణ్యం లభిస్తుందో తెలియాలంటే మీరు ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.
హిందూ మతంలో పుణ్య స్నానానికి ఓ పవిత్రత ఉంది. అన్ని దేవుళ్లతో పాటు గంగాదేవిని కూడా ఎంతో భక్తితో పూజిస్తారు. అయితే 144 ఏళ్లకు జరిగే ఈ మహా కుంభమేళాలో చాలా మంది పుణ్య స్నానం ఆచరించాలని ఎంతో పరితపిస్తున్నారు. ఇందులో పవిత్ర స్నానం ఆచరిస్తే దేవుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని నమ్ముతారు. చేసిన పాపాలు అన్ని కూడా తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. కష్టాలు అన్ని తొలగి సంతోషంగా వస్తుంది. అలాగే మానసికంగా, శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ మహా కుంభమేళాలో చివరి పుణ్య స్నానం చాలా పవిత్రమైనది. ఈ పవిత్ర స్నానాన్ని సరైన పద్ధతిలో ఆచరిస్తే తప్పకుండా పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే మహా కుంభమేళాలో చివరి స్నానం ఆచరించేటప్పుడు భక్తులు ముందుగా గంగా జలం తీసుకుని వరుణ దేవుడిని భక్తితో పూజించాలి. మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా గంగా దేవిని, విష్ణువు, శివుడిని పూజించాలి. గంగా దేవికి పూజ చేయాలి. ఒక రాగి పాత్రలో నీరు తీసుకోవాలి. అందులో పువ్వులు, గంధం, తులసి, కుంకుమ, పసుపు వేసి ధ్యానం చేసి భక్తితో సమర్పించాలి. ఇలా పూజను ఆచరించిన తర్వాత పవిత్ర స్నానం ఆచరిస్తే పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి. పుణ్యం లభించడంతో పాటు కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.