Karma spares no one: మనం సంపాదించే ప్రతి పైసా ఏదోరకంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాగే మనం చేసే మంచి పనికి కూడా ఫలితం ఉంటుంది. ఇదే సమయంలో మనం చేసే చెడు కూడా మనకు ప్రతిఫలంగా చెడు జరిగే అవకాశం ఉంటుంది. దీనినే కర్మ అంటారు. జీవితంలో ఎవరు విడిచిపెట్టినా.. విడిచి పెట్టకపోయినా.. కర్మ మాత్రం ఎవరిని విడిచిపెట్టదని ఆధ్యాత్మిక శాస్త్రం తెలుపుతుంది. కర్మ ఎన్ని జన్మలైనా విడిచి పెట్టే అవకాశం లేదని కొన్ని కథలను బట్టి తెలుస్తుంది. ఇందులో ద్రుతరాష్ట్ర మహారాజు కథనే నిదర్శనం. ధృతరాష్ట్రుడు తన వందమంది కొడుకుల విషయంలో కొన్ని సందేహాలను వ్యక్తపరుస్తుండగా శ్రీకృష్ణుడు తనకు ఒక కథను చెప్పాడు. ఆ కథ ద్వారా కర్మ ఫలితం ఎలా ఉంటుందో వివరించాడు. ఆ కథ ఏంటంటే?
మహాభారతం ప్రకారం ధృతరాష్ట్రుడికి వందమంది కౌరవులు కుమారులు అన్న విషయం తెలిసిన విషయమే. అయితే కురుక్షేత్ర యుద్ధంలో 100 మంది కుమారులు ఒకేసారి మరణిస్తారు. ఒక కొడుకు మరణిస్తేనే ఆ తండ్రి శోకం ఎంతో ఉంటుంది. అలాంటిది వంద మంది కుమారులు ఒక్కసారిగా మరణించడం వల్ల దృతరాష్ట్రుడు ఎంతో బాధపడతాడు. ఈ సమయంలో శ్రీకృష్ణుడు దృతరాష్ట్రుడి వద్దకు వచ్చి నీ బాధను నువ్వే కొనితెచ్చుకున్నావు అని అంటాడు. అదేంటి అన్న సందేహంతో శ్రీకృష్ణుడి వైపు చూస్తుండగా తనకు ఒక స్టోరీ చెప్పాడు.
Also Read: Moral Story: డబ్బు మనిషి కంటే గొప్ప కాదు.. ఈ దీపం కథ చెప్పే నీతి ఇదే..
శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో ఇలా మాట్లాడుతూ.. మీరు 50 జన్మల ముందు ఒక వేటగాడిగా జన్మించారు. ఆ సమయంలో ఒక పక్షి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. అయితే దానిపై ఉన్న కోపంతో 100 పిల్ల పక్షులను ఒకేసారి చంపారు. ఈ సమయంలో ఆ పిల్లల పక్షి అయిన తండ్రి పక్షి చూస్తూ ఏం చేయలేకపోయింది. ఎంతో కన్నీరు పెడుతూ తనను శోభ పెట్టిన వారికి ఇలాంటి గతే పడుతుందని శాపం పెట్టింది. అయితే శాపం విషయం పక్కన పెడితే నువ్వు చేసిన ఈ పని నీ విషయంలో కూడా జరిగింది.
అయితే 50 జన్మల తర్వాత ఇలా ఎందుకు జరిగింది? అని ధృతరాష్ట్రుడు అనగా.. ఈ 50 జన్మల్లో మీరు ఎన్నో పుణ్యాలు చేశారు. ఆ పుణ్యాల ఫలితమే ఈ పాపం జరుగుతూ వచ్చింది. అయితే ఆ పుణ్యాల ఫలితాలు అయిపోయాయి ఆ తర్వాత ఇప్పుడు ఈ పాపం మీకు తగిలింది. అందుకే మీ వంద మంది కుమారులు ఒకేసారి మరణించారు. అప్పుడు ఆ పక్షి అయితే ఎలా బాధపడిందో.. ఇప్పుడు మీరు కూడా అలాగే బాధపడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడికి చెబుతాడు.
Also Read: What Can Astronauts Eat: వ్యోమగాములు ఎలాంటి ఆహారం తీసుకుంటారు?
మనుషుల విషయంలోనూ ఇదే జరుగుతుందని గరుడ పురాణం చెబుతుంది. చేసే ప్రతి పనిలో మంచిని మాత్రమే కోరుకోవాలి. చెడును కోరుకుంటే అది తిరిగి మళ్ళీ శాపం రూపంలో ఇబ్బంది పెడుతుంది అని ఇందులో ఉంది. ఒక జన్మలో చేసిన పాపం మరో జన్మలో కచ్చితంగా దాని ఫలితం అనుభవించాల్సి వస్తుంది అని కరుణ పురాణం తెలుపుతుంది.