Homeహెల్త్‌Sleep Paralysis Symptoms: నిద్రపోతున్నప్పుడు మీద ఎవరో కూర్చున్నట్లు అనిపిస్తే.. ఇలా చేయండి..

Sleep Paralysis Symptoms: నిద్రపోతున్నప్పుడు మీద ఎవరో కూర్చున్నట్లు అనిపిస్తే.. ఇలా చేయండి..

Sleep Paralysis Symptoms: మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా చాలా అవసరం. కంటినిండా నిద్రపోతేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవసరమైన పనులు చురుగ్గా చేయగలుగుతారు. అయితే రకరకాల కారణాల వల్ల చాలా మంది ప్రస్తుత కాలంలో కలత నిద్ర పోతున్నారు. నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా కళ్లు తెరిచి చూస్తే.. శరీరం కదలకపోవడం.. ఛాతీపై ఎవరో బరువుగా కూర్చున్నట్టు అనిపించడం.. అరవాలని ప్రయత్నించినా మాట బయటికి రాకపోవడం.. వంటి అనుభవాన్ని చాలా మంది పొందుతారు. దీనిని Sleep Paralysis అంటారు. ఇలా ఎందుకు ఏర్పడుతుంది? ఇలాంటి సమయంలో ఏం చేయాలి?

స్లీప్ పెరాలసిస్ అంటే ఏమిటి?
మనిషి నిద్రలో ముఖ్యంగా REM (Rapid Eye Movement) దశలో ఉన్నప్పుడు మెదడు మెలకువ వస్తుంది. కానీ శరీర కండరాలు ఇంకా నిద్ర స్థితిలోనే ఉంటాయి. ఈ సమయంలో కళ్లను తెరవగలిగినా చేతులు, కాళ్లు కదలవు. కొన్ని సెకన్ల నుంచి 2 నిమిషాల వరకు ఈ పరిస్థితి ఉంటుంది. కొందరికి ఛాతీపై ఒత్తిడి, గదిలో ఎవరో ఉన్నట్టుగా భ్రమ, ఊపిరి ఆడకపోవడం వంటి భావనలు కూడా కలుగుతాయి.

కొంతమంది వైద్య నిపుణుల ప్రకారం.. స్లీప్ పెరాలసిస్‌కు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయని అంటున్నారు. చాలాకాలంగా సరైన నిద్ర లేకపోవడం.. రాత్రిళ్లు ఆలస్యంగా మేల్కొని ఉండటం.. మానసిక ఒత్తిడి, ఆందోళన అధిక అలసట.. షిఫ్ట్ డ్యూటీలు చేయడం..వెన్నుపైనే పడుకోవడం..నిద్ర పట్టే సమయాల్లో అక్రమతలు ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి ఉంటుందని అంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగ ఒత్తిడిలో ఉన్నవారు, రాత్రిపూట పని చేసే వారు, నిద్రలేమితో బాధపడేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కొందరికి ఇది ఒక్కసారి మాత్రమే వస్తే, కొందరికి తరచూ రావచ్చు.

స్లీప్ పెరాలసిస్ వచ్చినప్పుడు భయపడకుండా ఉండటం ముఖ్యం. అది తాత్కాలికమే అని గుర్తుంచుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, వేళ్లను లేదా కాళ్లను కదిలించే ప్రయత్నం చేయడం ఉపశమనంగా ఉంటుంది. అయితే ప్రతిరోజూ 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ప్రతి రోజూ ఒకే సమయానికి పడుకోవాలి. మొబైల్, స్క్రీన్ టైమ్ తగ్గించాలి. పోషకాహారం తీసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. నిద్ర పోయే ముందు కాఫీ, టీ ఎక్కువగా తీసుకోవద్దు. అయితే తరచూ స్లీప్ పెరాలసిస్ వస్తూ, నిద్రలో ఊపిరి ఆడకపోవడం, పగటిపూట తీవ్రమైన అలసట ఉంటే నిద్ర నిపుణుడిని సంప్రదించాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular