FASTag Toll Payment Rules: జాతీయ రహదారిపై ప్రయాణం చేసేవారికి కేంద్రం కీలక సూచనలు చేసింది. ఇప్పటి వరకు 4 వీలర్ వాహనాలపై ప్రయాణించేవారు టోల్ ప్లాజా వద్ద నగదు చూపంలో చెల్లించడానికి ఆస్కారం ఉండేది. అయితే ఆ తరువాత ప్రబుత్వం FAST Tag ను అందుబాటలోకి తీసుకువచ్చింది. కానీ కొందరు దీని ద్వారా కాకుండా నగదు రూపంలో చెల్లించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఏప్రిల్ 10 నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. ఇక్కడ పూర్తిగా నగదు చెల్లింపులను నిలిపివేస్తూ కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితె..
టోల్ ప్లాజా చెల్లింపులు ఇక నుంచి పూర్తిగా డిజిటల్ రూపంలోనే జరగనున్నాయి. ఇవి కూడా FASTag లేదా UPI ద్వారానే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ లో నగదు నిల్వ ఉండి చెల్లిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ యూపీఐ ద్వారా చెల్లించాల్సి వస్తే మాత్రం అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రెండు విధానాల ద్వారా కూడా చెల్లింపులు చేయకపోతే మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కొత్త నిబంధనల ప్రకారం టోల్ ప్లాజా చెల్లింపులు ఎలా చెల్లించాలి?
ప్రతి వాహనానికి FASTag కచ్చితంగా ఉండాలి. టోల్ గేట్ వద్ద FASTag పనిచేస్తే సాధారణ టోల్ రుసుమే ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. FASTag లేకపోతే లేదా అందులో బ్యాలెన్స్ లేకపోతే UPI ద్వారా చెల్లించే అవకాశం ఉంటుంది. కానీ UPIతో చెల్లిస్తే సాధారణ టోల్ ఫీజుకంటే 1.25 రెట్లు ఎక్కువ వసూలు చేస్తారు. ఉదాహరణకు ₹100 టోల్ అయితే ₹125 చెల్లించాలి.
FASTag, UPI రెండూ పనిచేయకపోతే?
వాహనం టోల్ ప్లాజా దాటినా చెల్లింపు జరగకపోతే ఆ వాహన యజమానికి ‘ఈ-నోటీస్’ జారీ అవుతుంది. ఈ నోటీస్‌లో పెండింగ్ టోల్ మొత్తం ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. నోటీస్ వచ్చిన 72 గంటలలోపు చెల్లిస్తే అదనపు ఫీజు ఉండదు. అంటే అసలు టోల్ మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. నిర్దిష్ట గడువులో చెల్లించకపోతే అదే టోల్ మొత్తాన్ని రెండు రెట్లు వసూలు చేస్తారు. ఉదాహరణకు ₹100 టోల్ బకాయి ఉంటే ₹200 చెల్లించాల్సి వస్తుంది. ఈ చర్యను ‘అన్‌పెయిడ్ యూజర్ ఫీ’ కింద పరిగణిస్తారు.
15 రోజులు దాటితే కఠిన చర్యలు
ఈ-నోటీస్ వచ్చిన తర్వాత కూడా 15 రోజులపాటు చెల్లింపులు చేయకపోతే వాహనం వివరాలు VAHAN సిస్టమ్‌లో ఫ్లాగ్ అవుతాయి. ఆ తర్వాత వాహనం రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, ఇతర సేవలపై పరిమితులు వచ్చే అవకాశం ఉంది. అధికారులు అవసరమైతే జరిమానాలు, తదుపరి చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. FASTag వినియోగాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా ఇలాంటి నిబంధనలు పెడుతున్నట్లు తెలుస్తోంది.
అందువల్ల వాహనదారులు FASTagలో ఎప్పుడూ సరిపడా బ్యాలెన్స్ ఉంచాలి. టోల్‌కు ముందు UPI యాప్ పనిచేస్తోందో లేదో చూసుకోవాలి. SMS అలర్ట్స్ తప్పనిసరిగా చెక్ చేయాలి. ఈ-నోటీస్ వస్తే వెంటనే చెల్లించాలి. ఈ కొత్త విధానం దేశవ్యాప్తంగా టోల్ సేకరణను పూర్తిగా డిజిటల్ చేయడమే కాకుండా భవిష్యత్తులో మరింత ఆటోమేటెడ్ టోల్ వ్యవస్థకు మార్గం సుగమం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.