Cashback on Payments : ప్రస్తుత కాలంలో చాలామంది డిజిటల్ పేమెంట్స్ పైనే ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఫోన్ పే, గూగుల్ పే యూస్ చేస్తూ మనీ చెల్లింపులు చేస్తున్నారు. అయితే గూగుల్ పే వచ్చిన కొత్తలో ప్రతి పేమెంట్ కు ఏదో ఒక స్క్రాచ్ కార్డు వచ్చి రికార్డ్స్ పాయింట్ లేదా క్యాష్ బ్యాక్ వచ్చేవి. కానీ ఈ మధ్య అటువంటివి ఏమీ ఉండడం లేదని కొందరు వినియోగదారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ కొత్తగా ప్రతి పేమెంట్ పై స్క్రాచ్ కార్డు లేదా క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
ఇప్పటివరకు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా బ్యాంకు అకౌంట్ కు లింక్ చేసి అందులో నుంచి డబ్బులు చెల్లించేవారు. కానీ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ లేదా రూపే కార్డు ద్వారా తెలుపులు చేస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డు కంటే రూపే కార్డు ద్వారా చిన్న మొత్తంలో కూడా పేమెంట్ చేయవచ్చు. అంతేకాకుండా రూపే కార్డు ద్వారా ఎక్కువగా రివార్డు పాయింట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేసే వారికి క్రెడిట్ కార్డ్ కంటే రూపే కార్డు తోనే ఎక్కువ లాభాలు ఉన్నాయి.
అయితే ప్రతిసారి రూపే కార్డు పై రివార్డు పాయింట్స్ లేదా క్యాష్ బ్యాక్ రావాలంటే కొన్ని రకాల ప్రత్యేకమైన కార్డులు ఉన్నాయి. కొన్ని బ్యాంకులు రూపాయి కార్డ్స్ ను ఆఫర్ చేస్తూ వీటిలో క్యాష్ బ్యాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు. అయితే ఈ రూపే కార్డు పెంచుకునేటప్పుడు సరైన సంస్థ గురించి తెలుసుకోవాలి. లేదంటే అదనంగా ఫీజులు వసూలు చేసే అవకాశాలు ఉంటాయి. ప్రముఖ బ్యాంకుల నుంచి ఇచ్చే రూపే కార్డు తీసుకుంటే అధిక ప్రయోజనాలతో పాటు తక్కువ ఛార్జీలు ఉండే అవకాశాలు ఉంటాయి.
కేవలం ఈ రూపాయి కార్డు ద్వారా మాత్రమే కాకుండా సూపర్ మని, మొబైల్ పే వంటి యాప్స్ ద్వారా చెల్లింపులు చేస్తే కూడా ప్రతిసారి క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే వీటిని వాడేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇవి ఎంత మొత్తంలో చెల్లింపులు చేస్తే క్యాష్ బ్యాక్ ఇస్తున్నాయో ముందే తెలుసుకొని అలాంటి పేమెంట్స్ చేయాలి. ఇప్పటికే చాలా వరకు బ్యాంకులు రూపే కార్డ్స్ ఆఫర్స్ చేస్తున్నాయి. వీటిలో కొన్ని బ్యాంకులు ఏడాది పాటు ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా అందిస్తుండగా.. మరికొన్ని బ్యాంకులు తక్కువ ఫీజుతో అందిస్తున్నాయి. అయితే రూపే కార్డు ద్వారా కొన్ని రకాల చెల్లింపులపై అత్యధిక కన్వీనెంట్ ఫీజు వసూలు చేసే అవకాశం ఉంది.