spot_img
Homeహెల్త్‌Dragon fruit : డ్రాగన్ ఫ్రూట్‌‌లో ఇన్ని ప్రయోజనాలున్నాయా? ఖరీదు ఎక్కువే.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా...

Dragon fruit : డ్రాగన్ ఫ్రూట్‌‌లో ఇన్ని ప్రయోజనాలున్నాయా? ఖరీదు ఎక్కువే.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే!

Dragon fruit : ఆరోగ్యంగా ఉండాలని చాలామంది ఈ రోజుల్లో పండ్లు ఎక్కువగా తింటారు. పండ్లు తినడం వల్ల ఆరోగ్యం కుదుట పడటంతో పాటు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఇవి కాస్త రేటు అయిన డబ్బులు ఖర్చు పెట్టి మరి కొంటుంటారు. ఎక్కువగా డైట్ ఫాలో అయ్యే వాళ్లు పండ్లను తీసుకుంటారు. సలాడ్స్ లేదా ఓట్స్‌తో తింటుంటారు. మరీ ముఖ్యంగా సీజనల్‌గా దొరికే పండ్లను అయితే తప్పకుండా తింటారు. అయితే ఈ పండ్లలో డ్రాగన్ ఫూట్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చాలా మంది వీటిని సాగు చేస్తున్నారు. సీజనల్‌గా దొరికే ఈ ఫ్రూట్ చాలా రేటు ఉంటుంది. అయిన ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలామంది వీటిని కొని తింటుంటారు. ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒక దాంట్లో లోపల రెడ్ కలర్, వైట్ కలర్‌లో ఉంటాయి. రెండింటిలో ఏది తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదే. మరి రోజూ వీటిని డైట్‌లో యాడ్ చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చుద్దాం.

డ్రాగన్ ఫ్రూట్‌ను రోజు ఒక చిన్న ముక్క తిన్న చాలు. ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్ వల్ల మధుమేహ కంట్రోల్ అవుతుంది. షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే పెద్ద పేగు క్యాన్సర్ నివారించడంలో కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ బాగా సాయపడుతుంది. ఈ ఫ్రూట్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులను కూడా తగ్గించడంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పీచు, ఫైబర్ వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపరుస్తుంది. దీనిని రోజూ చిన్న ముక్క అయిన తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.

ఈ పండును తినడం వల్ల గుండె సంబంధిత సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇందులో అధికంగా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వీటిని రోజూ తింటే గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఈ పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఈ పండును తినడం ఇష్టం లేకపోతే జ్యూస్ చేసి కూడా తీసుకోవచ్చు. దీనివల్ల స్కిన్ గ్లోగా తయారవుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యానికి కూడా డ్రాగన్ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎముకలు ఆరోగ్యంగా ఉండటంలో డ్రాగన్ ఫ్రూట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కీళ్లు నొప్పులతో బాధపడేవాళ్లు దీనిని రోజూ తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌లో ఉన్న కూడా ఈ పండు సహాయపడుతుంది.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Nagarjuna

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...
Music Directors

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...
Oktelugu Epaper