Chicken : ముక్క లేకుండా ముద్ద దిగని వారు ఇప్పటికీచాలా మంది ఉన్నారు. ఒకప్పుడు పండగలు, చుట్టాలు వస్తేమాత్రం ఇంటికి వచ్చే నాన్ వెజ్ ఇప్పుడు క్రమంగా ఆహారంలో భాగంగా మారింది. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఆదివారం మాత్రమే తెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు ఆదివారం మాత్రమే కాదు రోజులో ఒకసారి అయినా అనేవిధంగా కొందరి లైఫ్ లో తిష్ట వేసింది ఈ నాన్ వెజ్. మరీ ముఖ్యంగా చికెన్ కదా. మీరు కూడా ఈ నాన్ వెజ్ ప్రియులా? ముఖ్యంగా చికెన్ ప్రియాలా? అయితే ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకుందాం. అయితే చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిదే. కానీ అతి సర్వాత్రా వర్జయేత్ అంటారు. ముఖ్యంగా చికెన్ లోని కొన్ని పార్ట్ లు మంచివి కావు అంటున్నారు నిపుణులు. ఇప్పుడు దానికి సంబంధించిన ఓ విషయం తెలుసుకుందాం.
చికెన్ ప్రోటీన్ అద్భుతమైన మూలం. చాలా మంది దీనిని తమ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకుంటారు. కానీ మన ఆహారం నుంచి తొలగించాల్సిన చికెన్‌లో ఒక భాగం ఉందని మీకు తెలుసా? ఈ భాగం మన ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అవును నిజమే దాన్ని మనం స్కిప్ చేయాల్సిందేనట.
మరి ఆ భాగం ఏంటి అనుకుంటున్నారా? అదే స్కిన్. యస్ కోడి చర్మం. పిల్లలకు ఈ చికెన్ కర్రీలోని స్కిన్ ను పెడితే ఛీ ఇది మాకు ఎందుకు అంటారు కదా. ఈ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నిజానికి, కోడి చర్మం పనికిరానిది మాత్రమే కాదు. అది మన ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం. చికెన్ స్కిన్ తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో? దానిని మన ఆహారం నుంచి ఎందుకు తొలగించాలో తెలుసుకుందాం.
Also Read : చికెన్ వారానికి ఎన్నిసార్లు తినాలి?
కోడి చర్మం వల్ల చెడు ఏమిటి?
కొవ్వు- కొలెస్ట్రాల్ సమృద్ధిగా ఉంటుంది
కోడి చర్మంలో చాలా కొవ్వు, చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి. ఈ కొవ్వు కారణంగా, మీరు దీన్ని క్రమం తప్పకుండా తింటే, అది మీ గుండెకు హానికరం కావచ్చు. దీనితో పాటు, బరువు పెరిగే ప్రమాదం కూడా పెరుగుతుంది. కోడి చర్మం శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది.
పోషకాహార లోపం
కోడి చర్మంలో ఎటువంటి ముఖ్యమైన పోషకాలు ఉండవు. కోడి మాంసంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కానీ కోడి చర్మంలో ఈ పోషకాలన్నీ పూర్తిగా లేవు. ఇది కొవ్వు, కొలెస్ట్రాల్‌తో నిండి ఉంటుంది. ఇది మీ శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు. మీరు చికెన్ తింటుంటే, దాని చర్మం కాకుండా మాంసం భాగాన్ని తినడం మంచిది. ఎందుకంటే ఇది పోషకాలకు మూలం కాదు.