spot_img
Homeపండుగ వైభవంKarthika Masam 2022: కార్తీక మాసం నియమాలేంటి..? ఏం చేయాలి..? ఏం చేయకూడదు..?

Karthika Masam 2022: కార్తీక మాసం నియమాలేంటి..? ఏం చేయాలి..? ఏం చేయకూడదు..?

Karthika Masam 2022: శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు.. వేదానికి సమానమైన శాస్త్రం.. గంగతో సమానమైన తీర్థం లేదు.. అలాగే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని స్కంధ పురాణంలో పేర్కొనబడింది. అన్ని మాసాల్లో కెల్లా కార్తీకమాసం చాలా విశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఈ మాసం అత్యంత ప్రీతికరమైనది. ఈ కాలంలో వీరిద్దరిని పూజించడం వల్ల అనేక పుణ్యాలు వస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. సాధారణంగా దీపావళి తరువాత పాడ్యమిరోజున కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. కానీ ఈసారి 24 వ తేదీ దీపావళి.. 25న గ్రహణం సందర్భంగా 26 నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. అయితే కార్తీక మాసాన్ని ఎలా ఆచరించాలి..? ఈ కాలంలో ఎలాంటి పనులు చేయకూడదు..?

Karthika Masam 2022
Karthika Masam 2022

ఈనెల 25వ తేదీనే సాయంత్రం పాడ్యమి మొదలవుతుంది. అంటే అప్పుడే కార్తీకమాసం ప్రారంభం అవుతుంది. కానీ సూర్యోదయం పాడ్యమి లెక్కలోకి తీసుకుంటారు. అందువల్ల 26 నుంచి కార్తీక మాసం నుంచి నియమాలు పాటించాలి. నెలరోజుల పాటు అంటే నవంబర్ 23న ఈ మాసం పూర్తవుతుంది. ఈ కాలంలో చేసే పూజలు, వ్రతాలతో అనుకున్న ఫలితాలు వస్తాయని పండితులుచెబుతున్నారు. అయితే కార్తీక మాసంలో శివకేశవులిద్దరిని సమానంగా ఆచరించి కొన్ని పద్ధతులు పాటించాలని అంటున్నారు. అంతేకాకుండా కార్తీకమాసంలో నదీన్నానం ఎంతో ప్రాముఖ్యమైనదని అంటున్నారు.

కార్తీక మాసంలో ఉపవాసం ఉండాలనుకునేవారు కొన్ని నియమాలు పాటించాలి. సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయాలి. ఒకపూట మాత్రమే భోజనం చేయాలి. అదీ శాఖాహారాన్నే తినాలి. నిత్యం ఆరాధ్యించే దేవునిపై మనసును ఉంచాలి. నేలపైనే నిద్రించాలి. దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. ఇక నదీస్నానాలు చేయడం మంచిది. నదులు దూరం ఉన్నవాళ్లు వారానికి ఒకసారైనా వెళ్లడం మంచిది. నదీస్నానం పూర్తయిన తరువాత నదుల్లో దీపాలు వదలాలి. ఇక ఈ మాసాన్ని పాటించేవారు. మాంసాహారం జోలికి పోకూడదు. మంచంపై నిద్రించకూడదు. ఒకపూట మాత్రమే భోజనం చేయాలి. ఇతరుల మనసును నొప్పించకూడదు. నిత్యం పూజలపైనే దృష్టి సారించాలి.

Karthika Masam 2022
Karthika Masam 2022

కార్తీక మాసం శివుడు, విష్ణువులిద్దరికి ఇష్టమే. అందువల్ల శైవ, విష్ణువు ఆలయాలు ఈ కాలంలో దైవనామస్మరణతో మారుమోగుతాయి. వీలైనప్పుడల్లా ఈ ఆలయాలను సందర్శించాలి. విష్ణువుకు తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిస పువ్వు , గరిక, దర్బలను సమర్పించాలి. శివుడికి బిల్వ దళాలు, జిల్లేడు పూలను ఇవ్వాలి. అర్చకులకు ఒక పాత్రలో బియ్యం, ఉసిరికాయ వంటి వస్తువులతో కూడిన దీపాన్ని దానం ఇవ్వాలి. ఈ మాసంలో సోమవారం ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటున్నారు.

 

 

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper