Vemuri Radhakrishna: కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనకు వేమూరి రాధాకృష్ణ సపోర్ట్ ఇచ్చారు. కాకపోతే ఆయన ఢిల్లీ వెళ్లలేదు. ముంబై వెళ్లలేదు. చెన్నై కూడా వెళ్లలేదు. హైదరాబాదులో ఉంటూ.. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళన మీద.. ఎన్నికల సంఘం వ్యవహరించాల్సిన తీరు మీద.. సుప్రీంకోర్టు స్పందించాల్సిన తీరు మీద ఆయన తన ఆంధ్రజ్యోతి పత్రికలో ఆదివారం కొత్త పలుకు పేరుతో సంపాదకీయం రాశారు.
వాస్తవానికి కాక్రోచ్ జనతా పార్టీకి ఆంధ్రజ్యోతి పతాక స్థానం ఇస్తోంది. బిజెపి అంటే రాధాకృష్ణకు ప్రేమ ఉండదు అలాగని ద్వేషం కూడా ఉండదు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాధాకృష్ణ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ సిజేపి ఆందోళనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఇబ్బంది ఉంటుంది. పైగా, కాంగ్రెస్ పార్టీ సిజెపితో స్వరం పలికింది. ఆందోళనలో, నిరసనలో భాగం పంచుకుంటున్నది. అందువల్లే రాధాకృష్ణ సీజేపీకి జై కొడుతున్నారు.
కొత్త పలుకు వ్యాసంలో కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. వాస్తవానికి ఇంత సంపాదకీయం రాసిన ఆర్కే. ఒకసారి రీ చెక్ చేసుకుని ఉంటే మరింత బాగుండేది. ఎందుకంటే ఎన్నికల సంఘం సర్ ప్రక్రియ మీద అనేక పర్యాయాలు క్లారిటీ ఇచ్చింది. డబుల్ ఓట్లను.. చనిపోయిన వారిని.. ఇతర దేశాల నుంచి వలస వచ్చి ఇక్కడ అక్రమంగా ఉంటున్న వారి ఓట్లను తొలగించింది. వాస్తవానికి ప్రజాస్వామ్యం బలంగా ఉండాలి అంటే కచ్చితంగా ఎన్నికల వ్యవస్థ సమర్థవంతంగా ఉండాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ఓట్లు జారీ చేస్తే.. ప్రతిప శక్తులు ఓట్లు వేసి తమకు నచ్చిన వ్యక్తులను ఎన్నుకుంటే.. వ్యవస్థలు మొత్తం నాశనమవుతాయి. అందువల్ల ఓటర్ల నమోదు.. ఇతర వ్యవహారాలపై ఈసీ లోతుగా పరిశీలన జరిపింది. చనిపోయిన, అనుమానాస్పద ఓట్లను తొలగించింది
ఏకాఏకిన ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోలేదు. అనేక సమావేశాలు.. వరుస భేటీల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ప్రక్షాళన చేయడం మొదలుపెట్టింది.. అలాంటప్పుడు ఎన్నికల సంఘం తీరును ప్రశ్నించాల్సిన అవసరమేముంది. ఇటీవల రాష్ట్రపతిని రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు. సర్ ప్రక్రియలో జరిగిన అక్రమాల మీద మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని రాష్ట్రపతి అడిగారు. దానికి రాహుల్ గాంధీ త్వరలో సమర్పిస్తామని ప్రకటించారు. అంటే ఇన్ని రోజులపాటు ఆధారాలు లేకుండానే ధర్నాలు చేశారా.. నిరసనలు చేపట్టారా.. ఈ విషయాన్ని రాధాకృష్ణ ఎందుకు మర్చిపోయారు..
ఫ్రాన్స్ దేశంలో ప్రాథమిక పాఠశాలలో వసతులు లేవు. దీంతో అక్కడ ఆందోళనలు తారస్థాయికి చేరుకున్నాయి. వాస్తవానికి ఇదే అంశం మీద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. కానీ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.. వాస్తవానికి ఇక్కడ నిందించాల్సింది వ్యక్తులను కాదు. ఫ్రాన్స్ లో చేసిన ఆందోళనలో న్యాయముంది. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు . కానీ కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు రాజకీయపరమైనది. పైగా నేషనల్ మీడియాలో దీని వెనుక ఉన్న అసలు రాజకీయ రంగు బయటపడింది. అలాంటప్పుడు ఎవరు నిరసనకు వస్తారు.. ఎందుకు నిరసన చేపట్టాలి.. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు కూడా విద్యార్థులు పాల్గొనడం లేదు. కేవలం లెఫ్ట్ భావజాలం ఉన్న విద్యార్థి సంఘాలు మాత్రమే పాల్గొన్నాయి. దీనిని బట్టి కాక్రోచ్ జనతా పార్టీ ఆవేశం.. కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్దేశం..ఆప్ అసలు రంగు ఏంటనేది రాధాకృష్ణ తెలుసుకొని ఉంటే బాగుండేది.
వ్యాసం మొత్తంలో దేశంలో ఉన్న వ్యవస్థల గురించి మాట్లాడుకుంటూ వచ్చిన ఆయన.. పనికిమాలిన రాజకీయ పార్టీల స్వార్థం గురించి ప్రస్తావించకపోవడం విశేషం.. దేశంలో జరుగుతున్న ఈ ఆందోళన వెనుక ఎటువంటి శక్తులు ఉన్నాయి.. వారి వెనుక ఏం జరుగుతోంది.. మధ్యలో మస్క్ ఎందుకు భారత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు.. ట్రంప్ గుడ్లు ఉరిమి ఎందుకు చూస్తున్నాడు.. మధ్యలో ఈ సో కాల్డ్ పార్టీలు ఎందుకు ధర్నా చేస్తున్నాయి.. ఇవన్నీ సమాధానం తెలియని ప్రశ్నలు కాదు. కాకపోతే వీటి గురించి లోతుగా అధ్యయనం చేయకుండా రాధాకృష్ణ తన కొత్త పలుకు వ్యాసం రాయడమే అసలైన విషాదం.