Homeఎంటర్టైన్మెంట్Young Heroes Makeover: యంగ్ హీరోల కొత్త మెకోవర్ వెనక ఉన్న అసలు కారణం ఇదేనా..?

Young Heroes Makeover: యంగ్ హీరోల కొత్త మెకోవర్ వెనక ఉన్న అసలు కారణం ఇదేనా..?

Young Heroes Makeover: ప్రస్తుతం యంగ్ హీరోలందరు సరికొత్త మెకోవర్ తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా చాలామంది యంగ్ హీరోలు మాస్ జపం చేస్తున్నారు. ఇంతకు ముందు వరకు అక్కినేని అఖిల్ లవర్ బాయ్ సినిమాలను చేస్తూ ముందుకు సాగినప్పటికి ఇప్పుడు లెనిన్ సినిమాతో మాస్ అవతారం ఎత్తాడు. అలాగే నాని సైతం ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ముందుకు సాగినప్పటికి ఇప్పుడు మాస్ జపం చేస్తున్నాడు. దసర సినిమాతో సత్తా చాటిన నాని ఇప్పుడు […]

Young Heroes Makeover: ప్రస్తుతం యంగ్ హీరోలందరు సరికొత్త మెకోవర్ తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా చాలామంది యంగ్ హీరోలు మాస్ జపం చేస్తున్నారు. ఇంతకు ముందు వరకు అక్కినేని అఖిల్ లవర్ బాయ్ సినిమాలను చేస్తూ ముందుకు సాగినప్పటికి ఇప్పుడు లెనిన్ సినిమాతో మాస్ అవతారం ఎత్తాడు. అలాగే నాని సైతం ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ముందుకు సాగినప్పటికి ఇప్పుడు మాస్ జపం చేస్తున్నాడు. దసర సినిమాతో సత్తా చాటిన నాని ఇప్పుడు పారడైజ్ అంటూ మరోసారి తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ప్రస్తుతం శర్వానంద్ సైతం సంపత్ నంది తో ‘భోగి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక వీళ్ళందరు కొత్త గెటప్ లతో సినిమాలు చేసి ప్రేక్షకుల్లో ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు… వీళ్ళందరూ ఈ సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు.

Also Read: రష్మిక పెళ్లి గురించి రిషబ్ శెట్టి మాట్లాడలేదా..?వైరల్ వీడియో..

తద్వారా వాళ్ళు మాస్ హీరో గానే కొనసాగుతారా? లేదంటే క్లాస్ సినిమాలను సైతం చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక వీళ్ళందరితో పాటు ఇంకొంతమంది హీరోలు కూడా మాస్ హీరోలుగా మారాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక వీళ్ళు ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాలతో ఎలాంటి ఐడెంటిటిని సంపాదించుకుంటారు తద్వారా వాళ్ళకంటూ గుర్తుండిపోయే సినిమాలను చేస్తారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

కొత్త గా ట్రై చేయడంలో తప్పు లేదు కానీ మాస్ హీరోలుగా వాళ్ల మార్కెట్ ను కాపాడుకుంటారా? లేదంటే చెడగొట్టుకుంటారా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వాళ్ళు సినిమాలు తేడా కొడితే మాత్రం మళ్లీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా ఇంతకుముందు చేసిన లవ్ స్టోరీలను, ఫ్యామిలీ సబ్జెక్టులను మాత్రమే చేసుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడనుందా?

ఇప్పటివరకు చాలామంది మాస్ హీరోలుగా మారారు. ఒకసారి మాస్ హీరోగా మారితే వాళ్ల మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే ప్రేక్షకులు కూడా వాళ్ళను ఆదరించే తీరు మారిపోతుంది. ఇక బీ,సీ సెంటర్లోని ప్రేక్షకులు మాత్రమే సినిమాలను ఒకటికి రెండుసార్లు చూసి సినిమాను సాక్స్ తీరాలకు చేర్చుతారు…కాబట్టి ప్రతి హీరో మాస్ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper