Pawan Kalyan Remuneration: సినిమా ఇండస్ట్రీకి వారసత్వంగా ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారనే గ్యారంటీ లేదు. కొంతమంది మాత్రమే ఇక్కడ తమ హవాని కొనసాగిస్తుంటారు. ఎంత బ్యాగ్రౌండ్ ఉన్న కూడా తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం చాలా వరకు కష్టపడాల్సిన అవసరమైతే ఉంది. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు ఆదరిస్తున్నారు. తన నుంచి ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు ఎలాంటి కథైతే బాగుంటుందని అంచనావేసి మంచి స్టోరీస్ ను ఎంపిక చేసుకొని సినిమాలను చేసిన వాళ్లు మాత్రమే టాప్ లెవల్ కి వెళ్తారు. ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ సైతం చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ కి వచ్చి తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. గత సంవత్సరం ఓజీ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక మార్చి 19 వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్నా నేపథ్యంలో ఇప్పటికి ఈ మూవీకి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాల విషయంలో భారీగా రెమ్యూనరేషన్ పెంచేసినట్టుగా తెలుస్తుంది.
Also Read: రష్మిక పెళ్లి గురించి రిషబ్ శెట్టి మాట్లాడలేదా..?వైరల్ వీడియో..
ఇంతకుముందు వరకు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు 120 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నాడనే వార్తలైతే వస్తున్నాయి…నిజానికి తెలుగులో మాత్రమే మార్కెట్ ఉన్న పవన్ కళ్యాణ్ కి భారీ మొత్తంలో పారితోషికం ఇస్తున్నారంటే ఆయన రేంజ్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు…
అతని సినిమాలను తన అభిమానులు ఒకటి పదిసార్లు చూసి సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడంలో కీలకపాత్ర వహిస్తున్నారు. కాబట్టి తనలాంటి హీరోకి అంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చిన ప్రాబ్లం లేదు అనే ధోరణిలో సైతం ఆలోచిస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే తెలుగులో మాత్రమే మార్కెట్ ఉన్న పవన్ కళ్యాణ్ ఆ రేంజ్ పారితోషికాన్ని తీసుకుంటున్నారు. ప్రొడ్యూసర్స్ పాన్ ఇండియా హీరోలకు సైతం అంత భారీ పారితోషికాన్ని ఇవ్వడం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ కి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు అంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉంది మనం అర్థం చేసుకోవచ్చు…