spot_img
Homeఎంటర్టైన్మెంట్Yashmi Gowda: 'బిగ్ బాస్ 8' నుండి బయటకి రాగానే యష్మీకి బంపర్ ఆఫర్..ఇక టాలీవుడ్...

Yashmi Gowda: ‘బిగ్ బాస్ 8’ నుండి బయటకి రాగానే యష్మీకి బంపర్ ఆఫర్..ఇక టాలీవుడ్ లో ఈమెకు తిరుగు లేదేమో!

Yashmi Gowda: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఆడపులి గా పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్స్ లో ఒకరు యష్మీ గౌడ. గత వారమే ఈమె దురదృష్టం కొద్దీ ఎలిమినేట్ అయ్యింది. ఈమె ఎలిమినేషన్ పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తపరిచారు. ఎందుకంటే ఈమెకంటే తక్కువగా గేమ్స్ ఆడవాళ్లు ఇంకా హౌస్ లోనే ఉన్నారు, టాప్ 5 లో కచ్చితంగా ఉంటుంది అనుకున్న యష్మీ ఎలిమినేట్ అయ్యింది అనే బాధ అందరిలోనూ ఉంది. మధ్యలో ఈమె కొన్ని వారాలు బాగా నెగటివ్ అయ్యింది. అయ్యినప్పటికీ కూడా ఈమెని తమ ఇంట్లో ఆడపిల్ల లాగానే చూసారు ఆడియన్స్. ఎప్పుడైతే ఈమె తన గేమ్ పై ఫోకస్ ని తగ్గించి నిఖిల్ తో లవ్ ట్రాక్ నడపాలని చూసిందో, అప్పటి నుండి ఈమె గేమ్ గాడి తప్పింది. నిఖిల్ కోసం అనేక సందర్భాలలో స్టాండ్ తీసుకొని బాగా నెగటివ్ అయ్యింది.

అందరూ గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు కానీ, అలాంటివి ఏమి ఆడట్లేదు అంటూ కవరింగ్ ఇస్తూ ఉంటారు. కానీ యష్మీ మాత్రం బోల్డ్ గా ఓపెన్ గానే గ్రూప్ గేమ్స్ ఆడుతున్నాము అని హౌస్ లో ఉన్నప్పుడే చెప్పుకొచ్చింది. ఇవన్నీ ఆమెకు నెగటివ్ అయ్యింది. అంతే కాకుండా గత వారం సీత యష్మీ టాపిక్ ని తీసుకొచ్చి, ఆమె లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ట్రాప్ లో పడేసి వాళ్ళ గేమ్ ని డౌన్ చేస్తున్నావ్ అంటూ నిఖిల్ పై నిందలు వేయడం, దానికి యష్మీ సరైన స్టాండ్ తీసుకొని నిఖిల్ కోసం నిలబడకపోవడం పెద్ద మైనస్ అయ్యింది. ఈ సంఘటనతోనే ఆమె ఎలిమినేషన్ ఖరారైంది. అయితే యష్మీ మంచి అందగత్తె, ఈ సీజన్ పెద్దగా ఆసక్తికరంగా సాగకపోయినప్పటికీ, కేవలం యష్మీ అందాన్ని చూడడం కోసం షోని చూసే ఆడియన్స్ చాలా మంది ఉండేవారు. ముఖ్యంగా హాట్ స్టార్ లో లైవ్ ని ఎక్కువ శాతం మంది జనాలు యష్మీ కోసమే చూసేవారు.

బిగ్ బాస్ షోలో ఆమె టాప్ 5 లోకి రాలేకపోయినప్పటికీ, సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో, సీరియల్స్ అవకాశాలు ఇప్పుడు ఆమె కోసం క్యూలు కడుతున్నాయి. బిగ్ బాస్ రియాలిటీ షోలోకి అడుగుపెట్టకముందు ఈమె స్వాతి చినుకులు, నాగ భైరవి, త్రినయని మరియు కృష్ణ ముకుంద మురారి వంటి సీరియల్స్ చేసింది. వీటిల్లో స్వాతి చినుకులు, నాగభైరవి సీరియల్స్ లో ఈమె హీరోయిన్ గా నటించగా, కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో విలన్ గా నటించింది. ఇప్పుడు కొత్తగా ఆమె స్టార్ మా ఛానల్ లో రెండు సీరియల్స్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంతే కాకుండా ఆహా మీడియా లో ఒక వెబ్ సిరీస్ ఆఫర్ కూడా వచ్చిందట. వీటితో పాటు సినిమాల్లో కూడా అవకాశాలు క్యూ కడుతున్నట్టు సమాచారం. ఇలా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత చేతినిండా ఆఫర్స్ తో ఉంది యష్మీ గౌడా. భవిష్యత్తులో ఈమె ఏ రేంజ్ కి వెళ్లబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper