Yash Toxic Movie Remuneration: ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు ముగ్గురే ఉన్నారు. వాళ్ళు ప్రభాస్, అల్లు అర్జున్ , రామ్ చరణ్. వీరిలో రామ్ చరణ్ కంటే ప్రభాస్ , అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఎక్కువ ఉండొచ్చు . రామ్ చరణ్ 120 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటుండగా , అల్లు అర్జున్ , ప్రభాస్ చెరో 150 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. అయితే వీళ్ళని మించిన రెమ్యూనరేషన్ ని కన్నడ సూపర్ స్టార్ యాష్ అందుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయన హీరో గా నటించిన ‘టాక్సిక్ ‘ చిత్రం వచ్చే నెల 19 న విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా పై యూత్ ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుంటుందా లేదా అనే విషయం కాసేపు పక్కన పెడితే , ఈ సినిమాలో నటించడం కోసం యాష్ అక్షరాలా 180 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడట . సౌత్ ఇండియా లో ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకున్న హీరో మరొకరు లేరు. ఒకవేళ టాక్సిక్ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చి , పాన్ ఇండియా వైడ్ గా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడితే , యాష్ తన తదుపరి చిత్రం నుండి 200 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ‘టాక్సిక్’ చిత్రానికి నిర్మించడానికి , నిర్మాతకు అయిన ఖర్చు 350 కోట్ల రూపాయలట. అందులో హీరో రెమ్యూనరేషన్ సగానికి పైగా ఉంది. అందులోనూ ఈ చిత్రం లో టాప్ నటీనటులు నటించారు. నయనతార సౌత్ లోనే బిగ్గెస్ట్ లేడీ సూపర్ స్టార్.
Also Read: ‘ఫంకీ’ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. ‘లైలా’ ని మించిన డిజాస్టర్..పాపం నాగవంశీ!
ఈ చిత్రం కోసం ఆమె కనీసం 15 కోట్లు రెమ్యూనరేషన్ ని అందుకొని ఉంటుంది. అదే విధంగా కియారా అద్వానీ , రుక్మిణి వాసంత్ వంటి క్రేజీ హీరోయిన్స్ కూడా ఈ చిత్రం లో ఉన్నారు. వీళ్లకు చెరో పది కోట్లు ఇచ్చి ఉండొచ్చు. అదే విధంగా తారా సుతారియా , హుమా ఖురేషి వంటి హీరోయిన్స్ కూడా ఉన్నారు. వీళ్లిద్దరికీ కలిపి మరో 15 కోట్లు. ఇలా కేవలం హీరోయిన్స్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్స్ కలిపితే 50 కోట్ల వరకు ఉంటుంది. అలా కేవలం హీరో + హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ ని కలిపే ఈ చిత్రానికి 230 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇంత ఖర్చు తో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.