Homeఎంటర్టైన్మెంట్Funky worldwide closing collections: 'ఫంకీ' వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. 'లైలా' ని మించిన...

Funky worldwide closing collections: ‘ఫంకీ’ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. ‘లైలా’ ని మించిన డిజాస్టర్..పాపం నాగవంశీ!

Funky worldwide closing collections: ఈ నెలలో విడుదలైన సినిమాల్లో కంటెంట్ పరంగా, బాక్స్ ఆఫీస్ పరంగా తీవ్రమైన నిరాశకు గురి చేసిన చిత్రం ‘ఫంకీ'(Funky Movie). విశ్వక్ సేన్ హీరో గా నటించిన ఈ చిత్రం పై విడుదలకు ముందు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండేవి. కారణం , జాతి రత్నాలు లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన అనుదీప్ KV ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే. పాటలు , ట్రైలర్ వంటివి కూడా […]

Funky worldwide closing collections: ఈ నెలలో విడుదలైన సినిమాల్లో కంటెంట్ పరంగా, బాక్స్ ఆఫీస్ పరంగా తీవ్రమైన నిరాశకు గురి చేసిన చిత్రం ‘ఫంకీ'(Funky Movie). విశ్వక్ సేన్ హీరో గా నటించిన ఈ చిత్రం పై విడుదలకు ముందు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండేవి. కారణం , జాతి రత్నాలు లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన అనుదీప్ KV ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే. పాటలు , ట్రైలర్ వంటివి కూడా క్లిక్ అవ్వడం తో , కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ మొదటి ఆట నుండే ఈ చిత్రం ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. ఫలితంగా కనీసం ఓపెనింగ్ వసూళ్లు కూడా ఈ చిత్రానికి రాలేదు. అన్ని ప్రాంతాల్లో థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం .

నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 2.40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఆంధ్రా + సీడెడ్ కలిపి 2 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 4.40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 8.20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒకప్పుడు విశ్వక్ సేన్ కి మొదటి రోజు వచ్చే వసూళ్లు ఇవి. ఇప్పుడు క్లోజింగ్ లో రావడం కూడా కష్టం అయిపోతుంది. దీనిని బట్టీ విశ్వక్ సేన్ మార్కెట్ ఏ రేంజ్ లో డౌన్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు . ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి ఈ చిత్రానికి 1 కోటి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి క్లోజింగ్ లో 6 కోట్ల 20 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి.

Also Read: విష్ణు విన్యాసం రివ్యూ

గ్రాస్ వసూళ్లు దాదాపుగా 13 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. మంచి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కావడంతో ఈ సినిమాకు విడుదలకు ముందు 21 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ అందులో కనీసం 50 శాతం రికవరీ కూడా అవ్వకపోవడం గమనార్హం. బయ్యర్స్ కి ఈ చిత్రం గట్టి షాక్ అయితే ఇచ్చింది. భవిష్యత్తులో ఇక విశ్వక్ సేన్ పేరు మీద టికెట్స్ అమ్ముడుపోయే పరిస్థితి అసలు కనిపించడం లేదు. రీసెంట్ గా ఒక ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘నా దృష్టిలో ఫంకీ చిత్రం పెద్ద హిట్ ‘ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే ఆయన ఇంకా రియాలిటీ నుండి తేరుకోలేదు అన్నమాట. అందుకే విశ్వక్ సేన్ భవిష్యత్తులో కూడా కం బ్యాక్ ఇవ్వడం అసాధ్యం అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper