spot_img
Homeఎంటర్టైన్మెంట్Sreeleela: పూజా హెగ్డే బాటలో శ్రీలీల.. అదే తప్పు రిపీట్ చేస్తుందా?

Sreeleela: పూజా హెగ్డే బాటలో శ్రీలీల.. అదే తప్పు రిపీట్ చేస్తుందా?

Sreeleela: హీరోయిన్ శ్రీ లీల వరుస ఆఫర్లతో కెరీర్ లో ముందుకు దూసుకెళ్తుంది. 2019 లో కిస్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తెలుగులో పెళ్లి సందడి తో ప్రేక్షకులను మెప్పించింది. తన డాన్సింగ్ స్కిల్స్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది. ధమాకా మూవీ తో మంచి హిట్ అందుకుంది. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. వరుస పెట్టి సినిమాలకు సైన్ చేసింది.

భగవంత్ కేసరి తో హిట్ సొంతం చేసుకున్నప్పటికీ .. ఆది కేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో శ్రీలీల గుంటూరు కారం పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కెరీర్ లో మొదటిసారి మహేష్ బాబు లాంటి పెద్ద హీరో సినిమాలో అవకాశం అందుకుంది. ఇక్కడ కూడా ఆమెకు అదృష్టం కలిసొచ్చింది. గుంటూరు కారం లో ఆమెను ముందుగా సెకండ్ లీడ్ గా తీసుకున్నారు. ఇక పూజ హెగ్డే తప్పుకోవడంతో మెయిన్ హీరోయిన్ అయిపోయింది.

గుంటూరు కారం తన కెరీర్ కి గట్టి పునాది వేస్తుందని భావించింది. కానీ .. గుంటూరు కారం అనుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో శ్రీలీల పాత్ర పెద్దగా ఎలివేట్ కాలేదు అనే టాక్ వినిపిస్తోంది. ఎప్పటిలాగే ఆమె కేవలం డాన్సులకే పరిమితమైందని విమర్శలు వచ్చాయి. స్కంద సినిమా టైములో శ్రీలీల పాత్రకు ఎన్ని విమర్శలు వచ్చాయో .. అదే రేంజ్ లో గుంటూరు కారం విషయంలో కూడా శ్రీలీల కార్నర్ అయింది.

ఈ నేపథ్యంలో శ్రీ లీలను పూజ హెగ్డే తో పోలుస్తున్నారు విమర్శకులు. పూజా హెగ్డే కూడా ఇంతే .. డీజే సినిమా తర్వాత వరుసపెట్టి అవకాశాలు అందుకుంది.కేవలం హీరోలని చూసి సినిమాలకు సైన్ చేసింది. ఆచార్య, రాధే శ్యాం లాంటి డిజాస్టర్స్ తర్వాత పూజకి ఆఫర్లు కరువయ్యాయి. ఆమెకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు శ్రీలీల కూడా అదే తప్పు రిపీట్ చేస్తుందని చిత్ర వర్గాలు విమర్శలు చేస్తున్నారు.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper