Sitara Ghattamaneni
Sitara Ghattamaneni: మహేష్ బాబు గుంటూరు కారం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో మహేష్ బాబు కు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరిలు నటించారు. అలాగే జగపతి బాబు, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు… ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు ఓ రేంజ్ లో కలెక్షన్లు వస్తున్నాయని, చాలా ఆనందంగా ఉందని అన్నారు. అయితే తన ఫ్యామిలీ అంతటినీ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ కి తీసుకెళ్లి సినిమా చూపించాలని మహేష్ బాబు అనుకున్నారట. ఇదే విషయాన్ని నమ్రతతో చెప్తే .. షాక్ అయ్యారట. అదెలా సాధ్యం .. అందరూ వెళ్తే ఇబ్బంది కదా అని ఆమె అన్నారట. కానీ మహేష్ బాబు స్పెషల్ గా అన్ని ఏర్పాట్లు చేశారట.
థియేటర్ లో ఫ్యాన్స్ మధ్య సినిమా చూసే ఎక్స్పీరియన్స్ తన పిల్లలకు ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. కాగా సితార సినిమా చూసి మహేష్ ని హగ్ చేసుకుందట. సినిమా చాలా బాగుంది. నువ్వు అద్భుతంగా చేసావ్ అని చెప్పిందట. గౌతమ్ అయితే అభిమానుల మధ్య సినిమా చూసిన ఈ అనుభవం చాలా బాగుంది. నమ్మలేకపోతున్నా అని ఆశ్చర్యపోయాడని మహేష్ బాబు చెప్పారు. ఇది ఇలా ఉంటే… అందరి దృష్టి మహేష్ బాబు నెక్స్ట్ ఫిల్మ్ పై ఉంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు గుంటూరు కారం తన చివరి తెలుగు సినిమా కావచ్చని అన్నారు. అంటే రాజమౌళి తో సినిమా చేస్తే మహేష్ బాబు పాన్ ఇండియా స్టార్ అయిపోతాడు. ఇక ఆయన చేసే సినిమాలు అన్ని భాషల్లో విడుదల అవుతాయి. అందుకే గుంటూరు కారం సినిమాలో రెండు మాస్ పాటలు పెట్టి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వాలని అనుకున్నాం అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. రాజమౌళి-మహేష్ మూవీ వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు సమాచారం.
Web Title: Daughter sitaras shocking review on guntur kaaram is it like that with dad
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com