AI cause losses to the Film industry: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ల సత్తాను చూపిస్తూ గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఎలాంటి క్రమంలోనే దర్శకులు సైతం వైవిద్య భరితమైన పాత్రలను రాసుకొని హీరోలు చేత ఆయా పత్రాలను చేయించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు… ఇక ఇలాంటి క్రమం లోనే ఏఐ వచ్చి ఇప్పుడు దర్శకుల యొక్క ఐడెంటిటిని కోల్పోయే విధంగా చేస్తుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఏఐ ద్వారా చాలా రకాల వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా రాజమౌళి – మహేష్ బాబు కొట్టుకున్నట్టుగా ఒక వీడియోని కూడా క్రియేట్ చేశారు. స్వయంగా దీనిని రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేయడం విశేషం… ఇక దీన్ని చూస్తుంటే రాబోయే కొద్ది రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలు క్రియేట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకరకంగా ఏఐ ఇండస్ట్రీని చాలా వరకు నాశనం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది…
ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీ ఎదుర్కొని విపత్కర పరిస్థితులను సైతం ఏఐ ద్వారా ఎదురవుతున్నాయి. ఇక చాలామంది దీనివల్ల ఉపాధిని కూడా కోల్పోయే అవకాశాలైతే ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే ఇండస్ట్రీ మీద ఆధారపడి బతుకుతున్న చాలా మంది తమ ఉనికిని
కోల్పోయే ప్రమాదం కూడా ఉంది…
Also Read: రష్మిక పెళ్లి గురించి రిషబ్ శెట్టి మాట్లాడలేదా..?వైరల్ వీడియో..
ఇక ఏఐ ద్వారా ఎన్ని చేసినా కూడా అది రియలెస్టిక్ ఫీల్ తీసుకురాదనే ఉద్దేశ్యంలో కొంతమంది కొన్ని అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంటే, మరికొంతమంది మాత్రం నాచురల్ గా హీరోలు స్క్రీన్ మీద కనిపించినట్టుగానే అనిపిస్తుంది అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది తలుచుకుంటేనే భయం వేస్తుంది…
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా మారింది. ఇక ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తున్నాయి అనుకునే సందర్భంలో ఏఐ ద్వారా కొంతవరకు మంచి జరుగుతున్నప్పటికి కొన్ని పరిస్థితుల్లో మాత్రం ఏఐ ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ కొట్టే విధంగా కనిపిస్తోంది…