Homeబిజినెస్Realme P4 Lite: మిడిల్ క్లాస్ కు అనుగుణంగా ఉండే ఫోన్.. ఇప్పుడు అందుబాటులో.. ధర...

Realme P4 Lite: మిడిల్ క్లాస్ కు అనుగుణంగా ఉండే ఫోన్.. ఇప్పుడు అందుబాటులో.. ధర ఎంత అంటే?

Realme P4 Lite: మొబైల్ కొనేటప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ బడ్జెట్లో డివైస్ ను సొంతం చేసుకోవాలని అనుకుంటారు. ఆకట్టుకునే ఫీచర్లు ఉండి తక్కువ ధరలో అందించే కంపెనీలో Realme ఒకటి. దీని నుంచి ఇప్పటికే వచ్చిన ఎన్నో ఫోన్లు ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నేటి తరం వారికి అనుగుణంగా ఉండేవిధంగా కొత్త ఫోన్ తీసుకురావడానికి ఈ కంపెనీ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా లేటెస్ట్ గా ఫిబ్రవరి 20న ఈ కంపెనీ నుంచి ఓ మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. దాని పేరే Realme P4 Lite. ఇందులో డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో పాటు కెమెరా, బ్యాటరీ మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Realme P4 Lite డిస్ప్లే వేరే లెవెల్ అని అనుకోవచ్చు. ఇందులో 6.74 అంగుళాల కంఫర్ట్ డిస్ప్లే అమర్చారు. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. అలాగే 563 nits బ్రైట్నెస్ తో పనిచేస్తుంది. ఈ డిస్ప్లేపై వాటర్ ప్రూఫ్ రక్షణగా ఉంటుంది. దీనిపై ఎలాంటి వాటర్ మార్కు పడినా.. వేలిముద్రలు పడిన వెంటనే చెరిపేసేలా తయారు చేశారు. ఇందులో 18 GB వరకు రామ్ ఉండనుంది. అలాగే 128 GB స్టోరేజ్ కలిగి ఉంది. దీంతో ఇందులో కావాల్సిన ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా AI ఆధారిత ఫీచర్లను కలిగి ఉంటుంది.

Also Read: స్లిమ్ డిజైన్.. మెరుగైన బ్యాటరీ.. ఆకట్టుకుంటున్న LG కొత్త లాప్టాప్.. త్వరపడండి

ప్రస్తుతం చాలా మొబైల్స్ లో కెమెరా పనితీరు మెరుగుపడుతుంది. అలాగే Realme P4 Lite కొత్త మొబైల్లో 13 MP మెయిన్ కెమెరా అమర్చారు. ఈ కెమెరా ఫోటోగ్రఫీ వారితోపాటు సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఉపయోగంగా ఉంటుంది. అలాగే సెల్ఫీల కోసం, వీడియో కాలింగ్ కోసం అద్భుతమైన మెగాపిక్సల్ తో కెమెరాను అమర్చారు. ఇందులో ఉండే AI ఫీచర్స్ తో కావలసిన ఫోటోలను తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ మొబైల్లో బ్యాటరీ పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.6300 mAh కెపాసిటీ గల బ్యాటరీని అమర్చారు. దీనిని ఒకసారి చార్జింగ్ చేస్తే రెండు రోజుల వరకు చార్జింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ బ్యాటరీ 15 W ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. ఇక ఇందులో నేటి తరం వారికి అనుకునే విధంగా USB C వంటి port ఉండడంతో చార్జింగ్ కు అనుగుణంగా ఉంటుంది. అలాగే 6W రివర్స్ చార్జింగ్ కు కూడా సపోర్ట్ గా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో తోపాటు ఆపిల్ కార్ప్లే వంటి ఫీచర్లు ఇందులో అమర్చడంతో ఉద్యోగులకు, వ్యాపారులకు అనుగుణంగా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి ఓకేసారి యూజ్ చేసినా కూడా ఎలాంటి వేగం తగ్గకుండా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular