Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళుతున్న వాళ్ళలో రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం వారణాసి సినిమా చేస్తూనే ఆయన తన తదుపరి సినిమా విషయాల్లో కూడా చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు…ఆయన నుంచి సినిమా వచ్చిందంటే చాలు ప్రేక్షకులందరిలో ఒక అటెన్షన్ క్రియేట్ అవుతుంది. ఇక అలాంటి రాజమౌళి కెరియర్ స్టార్టింగ్ లో మాస్ సినిమాలను చేసి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ సంపాదించుకున్నప్పటికి ఇండస్ట్రీ హిట్ ను సాధించడానికి మాత్రం అతనికి దాదాపు పది సంవత్సరాల సమయమైతే పట్టింది. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘మగధీర’ సినిమాతో ఆయనకి ఇండస్ట్రీ హిట్ దక్కింది. ఇక తనకంటే ముందే వివి వినాయక్ పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు ఇండస్ట్రీ హిట్ల ను సాధించి టాప్ డైరెక్టర్లుగా మారారు… ఇక అలాంటి దర్శకుడు ఇప్పుడు ఫేడౌట్ అయిపోయారు.
పూరి జగన్నాథ్ అడపదడపా సినిమాలు చేస్తున్నప్పటికి ఆయన సక్సెస్ లను సాధించడం లేదు. ఎందుకని వాళ్ళిద్దరూ ఫేడౌట్ అయిపోయారు. ఎందుకని రాజమౌళి ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే విజువల్ వండర్స్ ని క్రియేట్ చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు.
అలాగే గ్రాఫిక్స్ వర్క్ మీద అతను చాలా వరకు తన సమయాన్ని కేటాయించాడు. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త పాయింట్ ఉండాలనే విధంగా ఈ జనరేషన్ కు తగ్గట్టుగా సినిమాని విజువల్ వండర్ గా మార్చడంలో అతను కీలకపాత్ర వహిస్తూ వచ్చాడు. అందువల్లే అతను టాప్ డైరెక్టర్ గా మారడనే చెప్పాలి…
ఇక ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను సాధించి పాన్ వరల్డ్ లో సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఈ విషయం మీద చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…ఇప్పటి వరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట సాధించబోయే విజయాలు మరొకెత్తుగా మారబోతున్నాయి…