spot_img
Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi-Krishna Vamsi: చిరంజీవి కృష్ణవంశీ కాంబో లో రావాల్సిన వందేమాతరం సినిమా ఎందుకు ఆగిపోయిందంటే..?

Chiranjeevi-Krishna Vamsi: చిరంజీవి కృష్ణవంశీ కాంబో లో రావాల్సిన వందేమాతరం సినిమా ఎందుకు ఆగిపోయిందంటే..?

Chiranjeevi-Krishna Vamsi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది డైరెక్టర్ల లో కృష్ణవంశీ ఒకరు. ఈయన ఒక సినిమాని నార్మల్ డైరెక్టర్లు తీసే సినిమాల కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ని పొందుపరిచి సినిమాలు తీయడంలో ఈయన దిట్టా అనే చెప్పాలి. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు చాలా సినిమాలు తీసి ఆయనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆయన తీసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడంతో పాటు ఆయన సినిమాల్లో నటించిన హీరోలకి కూడా మంచి గుర్తింపు వస్తుంది.

కృష్ణవంశీ సినిమాల్లో ఒకసారి నటిస్తే మంచి యాక్టర్ అని గుర్తింపు సంపాదించుకోవచ్చు అనే మాట అప్పట్లో ఇండస్ట్రీ లో చాలా బాగా వినబడేది. అలా ఒక ఆర్టిస్ట్ లో ఉన్న నటుడిని బయటికి తీసి అంతకుముందు ఆ నటులు చేసిన సినిమాలకి ఈ సినిమాకి నటన పరంగా వాళ్లు చాలావరకు బెస్ట్ అనేలా చేస్తాడు అలానే వాళ్లని బెస్ట్ యాక్టర్లు గా నిలిపే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. అయితే కృష్ణవంశీ ఇప్పటివరకు నాగార్జున,చక్రవర్తి, జగపతిబాబు, ఎన్టీఆర్,శ్రీకాంత్ మహేష్ బాబు,రవితేజ, నాని,రామ్ చరణ్ లాంటి హీరోలతో సినిమాలు చేసినప్పటికీ ఆయన జీవితం లో ఒక్కసారైనా చిరంజీవి తో సినిమా చేయాలనుకొని ఆయన చాలా సంవత్సరాల పాటు చిరంజీవి కోసం వెయిట్ చేస్తున్నారు…

అయితే ఒకప్పుడు వందేమాతరం అనే ఒక సినిమా వీళ్ళిద్దరి కాంబోలో రావాల్సి ఉంది. ఆ స్టోరీని కృష్ణవంశీ చిరంజీవికి కూడా చెప్పాడు ఆయనకి కూడా నచ్చింది. ఆ సినిమాకు సంబంధించిన ముహూర్తం కూడా జరిగింది. అయిన కూడా ఆ సినిమా సెట్స్ మీదికి మాత్రం రాలేదు కారణం అప్పుడు చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాడు దానివల్ల ఈ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేక అప్పుడు ఆ ప్రాజెక్ట్ ని డిలే చేశారు దాని తర్వాత ఈ సినిమా చేద్దాం అని అనుకున్న కూడా కొన్నిసార్లు కృష్ణవంశీ బిజీ గా ఉన్నాడు ఇక దాంతో అలా ఆ ప్రాజెక్ట్ చేయడం కుదరలేదు. అయితే కొద్దిరోజులకే ఇద్దరు ఫ్రీ ఉన్నప్పటికీ కృష్ణవంశీ వరుస ఫ్లాపులతో ఉండటం వల్ల చిరంజీవి కి ఉన్న మార్కెట్ దృష్ట్యా ఆయన తో సినిమా చేయలేదు. కృష్ణవంశీ అలా చిరంజీవితో చేయాల్సిన వందేమాతరం ప్రాజెక్టు చేయలేకపోయాడు.ఇప్పటికీ కృష్ణవంశీ జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉంది అంటే అది ఆ సినిమా చేయకపోవడమే అని ఆయన ఇప్పటికీ చెప్తూ ఉంటాడు.

చిరంజీవి కృష్ణవంశీ తో సినిమా చేయలేదు అనే ఒక కారణంతో అప్పట్లో రామ్ చరణ్ చేసిన సినిమాలు కూడా వరుసగా హిట్ అవుతున్నాయి కానీ నటుడిగా ఆయనకు మంచి పేరు రావట్లేదు అనే కారణం తో కృష్ణవంశీ సినిమాలో చేస్తే రామ్ చరణ్ కు నటుడిగా మంచి గుర్తింపు వస్తుందనే ఒకే ఒక ఉద్దేశ్యంతో కృష్ణవంశీ ప్లాప్ ల్లో ఉన్నా కూడా చిరంజీవి కృష్ణవంశీ కి పిలిచి మరీ రాంచరణ్ తో గోవిందుడు అందరివాడేలే అనే సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చాడు. కృష్ణవంశీ ఈ సినిమా చాలా బాగా తీసినప్పటికీ అది అవరేజ్ గానే ఆడింది.ఇక కృష్ణవంశీ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా ఆల్మోస్ట్ లేనట్టే…ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి కృష్ణవంశీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కృష్ణవంశీ ప్రస్తుతం ఫేడ్ అవుట్ లో ఉన్నాడు. కాబట్టి చిరంజీవి కృష్ణవంశీ తో సినిమా చేయడం అసాధ్యం అనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Oktelugu Epaper