Khadgam Movie : సినిమా ఇండస్ట్రీలో కృష్ణవంశీ వరుసగా గులాబీ, నిన్నే పెళ్ళడుతా, సింధూరం, అంతపురం, మురారి లాంటి వరుస సక్సెస్ లు కొట్టిన తర్వాత దేశం గురించి ఏదైనా సినిమా తీయాలి అనే కాన్సెప్ట్ తో ఒక స్టోరీ రాసుకున్నారు.ఆ సినిమాలో ముగ్గురు హీరోలు గా పెట్టీ తీయాలని అనుకున్నారు ఆ సినిమానే ఖడ్గం…ఇక క్యారెక్టర్ ల కోసం ఆర్టిస్ట్ లను వెతికే పనిలో ఉన్నప్పుడు ఏ క్యారెక్టర్ ఎవరు చేయాలి అనే దాని మీద చాలా రకాలైన చర్చలు జరిగిన తర్వాత ఒక క్యారెక్టర్ కోసం ప్రకాష్ రాజ్ ని తీసుకున్నారు.
ఇక సినిమా అంటే పిచ్చి ఉండే క్యారెక్టర్ లో రవితేజ అయితే బాగుంటాడని చెప్పి రవితేజ దగ్గరికి వెళ్లడం జరిగింది. రవితేజ తో ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ చెప్పి అందులో ఆయన చేయాల్సిన క్యారెక్టర్ గురించి చెప్పాడు.దానికి రవితేజ కూడా ఎగ్జైట్ అయిపోయి తను ఆ క్యారెక్టర్ చేస్తాను అని చెప్పాడు.కానీ రవితేజ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అని కృష్ణవంశీ ని అడిగితే అది శ్రీకాంత్ చేస్తున్నాడు అని చెప్పాడు. దాంతో రవితేజ ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వచ్చు కదా అని కృష్ణవంశీని అడిగారంట దాంతో కృష్ణవంశీ ప్రస్తుతం నువ్వు చేయాల్సిన కోటి క్యారెక్టర్ నువ్వు చేయగలవు అలాగే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా చేయగలవు,కానీ ఎప్పుడూ ఆ గా ఉండే కోటి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నువ్వు తప్ప ఇండస్ట్రీలో వేరే ఎవరు చేయలేరు కాబట్టి ఆ క్యారెక్టర్ నువ్వే చేయాలి అని చెప్పి మరి రవితేజ తో ఆ క్యారెక్టర్ చేయించాడు.
ఇక శ్రీకాంత్ క్యారెక్టర్ మీద చాలా చర్చలు జరిగాయి. కృష్ణవంశీ ముందుగా ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లి కథ చెప్పినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అని అడిగితే దానికి శ్రీకాంత్ ని తీసుకున్నాను అని చెప్పాడట దాంతో ప్రొడ్యూసర్ ఆ క్యారెక్టర్ లో వేరే ఒక హీరోని తీసుకుందాం సినిమా మొత్తం నేనే ప్రొడ్యూస్ చేస్తాను శ్రీకాంత్ వెస్ట్ అని చెప్పినప్పటికీ కృష్ణ వంశీ మాత్రం మీరు ప్రొడ్యూస్ చేసిన చేయకపోయినా ఆ క్యారెక్టర్ శ్రీకాంత్ అయితేనే బాగా సెట్ అవుతాడని చెప్పాడంట. అయినా కూడా ప్రొడ్యూసర్ వినకపోవడంతో ప్రొడ్యూసర్ తో గొడవ పెట్టుకుని మరి నువ్వు సినిమా చేయకపోయినా పర్వాలేదు కానీ ఆ క్యారెక్టర్ శ్రీకాంత్ చేస్తాడని గట్టిగా చెప్పి బయటకు వచ్చేసారంట… ఇక హీరో జగపతి బాబు కి ఖడ్గం సినిమా కథ తెలిసి తనే స్వయంగా కృష్ణవంశీ దగ్గరికి వచ్చి కలిసి ఆ సినిమా స్టోరీ చెప్పామని మొత్తం విన్నారంట.అది విని శ్రీకాంత్ చేసే క్యారెక్టర్ నాకు ఇస్తే చెప్పు నేను ఈ సినిమా చేస్తాను అని అని చెప్పాడంట… దాంతో కృష్ణవంశీ ఆ క్యారెక్టర్ నీకు ఇవ్వడం కుదరదు ఎందుకంటే నేను ఆల్రెడీ శ్రీకాంత్ తో కమిట్ అయ్యాను.అండ్ ఇంకోటి శ్రీకాంత్ తప్ప క్యారెక్టర్ ని ఎవరు అంత బాగా చేయలేరు అని చెప్పాడట అలా జగపతి బాబు కి కూడా ఈ సినిమాలో చేసే అవకాశం దక్కలేదు.
కృష్ణవంశీ మొండిగా శ్రీకాంత్ నీ ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో పెట్టి ఎవరు అవునన్నా , కాదన్నా ఆ సినిమాని సక్సెస్ చేసి అందరూ అవక్కయ్యేలా చేశారు. నిజానికి ఆ క్యారెక్టర్ లో శ్రీకాంత్ కాబట్టి బాగా సెట్ అయ్యాడు కానీ వేరే హీరో అయితే సెట్ అయ్యేవాడో లేదో కూడా తెలియదు.ఇక ఈ విషయం తెలిసిన చాలా మంది అప్పట్లో అందుకే కదా కృష్ణవంశీని క్రియేటివ్ డైరెక్టర్ అని పిలిచేది అని అన్నారు…