Sandeep Reddy Vanga: చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా మంచి సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలో వాళ్ళు చేస్తున్న సినిమాలు ప్రేక్షకుడిని ఎంతవరకు అలరిస్తాయి అనేది కూడా ఇక్కడ కీలకంగా మారనుంది.
ఇక ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అయితే సంపాదించుకుంటున్నాడు. ఇక అందులో భాగంగానే ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమా మీద ఇండియా వైడ్ గా మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగా చేసిన సినిమాల్లో ఆయనకి నచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఆయన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని వాళ్ళ అమ్మ నాన్న అతనికి అర్జున్ రెడ్డి అనే పేరు పెట్టలేదని, సందీప్ రెడ్డి అనే పేరు పెట్టారని దానివల్లే తను ఎప్పుడూ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటానని, అందువల్లే తనలో ఉన్న క్వాలిటీస్ ని ఒక క్యారెక్టర్ గా రూపొందించి అర్జున్ రెడ్డి సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చానని చెప్పాడు. ఇక దానివల్లే అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అంటే ఆయనకి చాలా ఇష్టమని కూడా చాలా సందర్భాల్లో తెలియజేశాడు.
ఇక మొత్తానికైతే అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ఆయనతో పాటు చాలా మంది అభిమానులకు కూడా ఫేవరెట్ గా మారిపోయిందనే చెప్పాలి…ఇక ఇప్పుడు ఈయన చేయబోయే స్పిరిట్ సినిమా మీద యావత్ భారతదేశం మొత్తం చాలా అసక్తి గా ఎదురుచూస్తుంది…అందుకే ఆయన ఈ సినిమాను ప్రేక్షకుల ఊహాకు అందని రేంజ్ లో తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో మరొక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది…