spot_img
Homeఎంటర్టైన్మెంట్Viswambhara Movie : విశ్వంభర' గ్రాఫిక్స్ కోసం ఇంత ఖర్చు చేస్తున్నారా..? రాజమౌళి కూడా పనికిరాడు!

Viswambhara Movie : విశ్వంభర’ గ్రాఫిక్స్ కోసం ఇంత ఖర్చు చేస్తున్నారా..? రాజమౌళి కూడా పనికిరాడు!

Viswambhara Movie : మెగాస్టార్ చిరంజీవి(Megatsar Chiranjeevi) కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర'(Viswambhara Movie). వశిష్ఠ(Vasistha Malladi) దర్శకత్వం లో, ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి(MM Keeravani)  సంగీత సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అప్పట్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉండేవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ గత ఏడాది విడుదల చేసిన టీజర్ లో గ్రాఫిక్స్ ని చూసి చిరంజీవి ని ద్వేషించే దురాభిమానులు మాత్రమే కాదు, ఆరాధించే అభిమానులు కూడా బండబూతులు తిట్టారు. భారీ గ్రాఫిక్స్ అన్నారు, తీరా చూస్తే అమీర్ పేట్ గ్రాఫిక్స్ తో సినిమాని చుట్టేస్తున్నట్టు ఉన్నారు. ఇలా అయితే కష్టమే అన్ని అభిమానులు సైతం మండిపడ్డారు. ఆడియన్స్ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ని తీసుకున్న మూవీ టీం, VFX టీం మొత్తాన్ని మార్చేసి, మళ్ళీ కొత్తగా రీ వర్క్ చేయించారు. ఇప్పుడు గ్రాఫిక్స్ అద్భుతంగా వచ్చాయని తెలుస్తుంది.

Also Read : అక్షరాలా 400 మిలియన్ వ్యూస్..చరిత్ర సృష్టించిన ‘గేమ్ చేంజర్’

డైరెక్టర్ వశిష్ఠ తండ్రి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘టీజర్ లో మీరు చూసిన గ్రాఫిక్స్ కేవలం AI ద్వారా జెనెరేట్ చేయబడింది. అప్పటికీ VFX వర్క్ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు పూర్తి అయ్యింది, కంటెంట్ అదిరిపోయింది, త్వరలోనే సరికొత్త టీజర్ ని విడుదల చేయబోతున్నాము. అప్పుడు మీ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి కేవలం గ్రాఫిక్స్ కోసమే 75 కోట్ల రూపాయిల ఖర్చు చేశారట. ఈ స్థాయిలో రాజమౌళి లాంటి డైరెక్టర్ మాత్రమే ఖర్చు చేసారని, ఒక కొత్త కుర్రాడు VFX కోసం ఇంత ఖర్చు చేయడం  ఇదే తొలిసారి అని అంటున్నారు. కేవలం గ్రాఫిక్స్ కోసమే ఇంత ఖర్చు చేసారంటే సినిమా ఏ రేంజ్ లో ఉండి ఉంటుందో మీరే ఊహించుకోండి.

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష కృష్ణన్ నటిస్తుండగా, కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇకపోతే రీసెంట్ గా హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన ‘రామ రామ’ పాట బాగా క్లిక్ అయ్యింది. అభిమానులలో ఉన్న నెగటివ్ అంచనాలను ఈ పాట కాస్త పాజిటివ్ చేసింది. జులై , లేదా ఆగస్టు నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. మెగా అభిమానులకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం తప్పనిసరి. ఎందుకంటే ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘గేమ్ చేంజర్’ చిత్రం తీవ్రంగా నిరాశపర్చింది.

Also Read : కారు నెంబర్ ప్లేట్ కోసం బాలయ్య చేసిన ఖర్చు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper