Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) తన కెరీర్ లో రాజమౌళి(SS Rajamouli) సినిమాలకు కాకుండా, మూడేళ్ళ విలువైన సమయాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ చేంజర్'(Game Changer) చిత్రం కోసం కేటాయించాడు. శంకర్ ఎప్పుడో అవుట్ డేటెడ్ అయిపోయాడు అనే విషయం తెలిసి కూడా, ఆయన మీద అభిమానం, గౌరవం తో ఈ సినిమాని చేసాడు. మధ్యలో ఆయన వేరే సినిమా చేయాల్సి వచ్చినా ఓపిగ్గా వేచి చూశాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ని కూడా రామ్ చరణ్ వదిలేసుకోవాల్సి వచ్చింది. అంత డెడికేషన్, గౌరవం చూపించి పని చేసిన ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నిందో మనమంతా చూసాము. మంచి స్టోరీ ని డైరెక్టర్ శంకర్ నాసిరకపు టేకింగ్ తో నాశనం చేసాడని, ప్రతీ ఒక్కరు ఆయన్ని తిట్టడం మొదలు పెట్టారు. ఓటీటీ లో విడుదలైన తర్వాత కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.
Also Read: ‘రెట్రో’ మూవీ మొట్టమొదటి రివ్యూ..క్లైమాక్స్ ఆడియన్స్ ఏడుపు ఆపుకోలేరు!
తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ ఈ రేంజ్ లో ఉండగా, హిందీ ఆడియన్స్ మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. హిందీ వెర్షన్ ఓటీటీ రైట్స్ ని దిల్ రాజు జీ తెలుగు ఛానల్ కి అమ్మాడు. మార్చి 7 న ‘జీ5’ యాప్ లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలు పెట్టిన ఈ సినిమా, ఇప్పటికీ టాప్ లోనే ట్రెండ్ అవుతూ ఉంది. సుమారుగా ఆరు వారాల నుండి నాన్ స్టాప్ గా ట్రెండ్ అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. ఒక సూపర్ హిట్ మూవీ తో సమానం ఇది. దీనిని బట్టి హిందీ లో రామ్ చరణ్ కి ఎలాంటి క్రేజ్ ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే అంటున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు 400 మిలియన్ల వాచ్ మినిట్స్ వచ్చాయట. ఇది ఒక సెన్సేషనల్ రికార్డు అని అంటున్నారు విశ్లేషకులు.
ఈ సినిమా విడుదలైన వారం రోజుల ముందు సంక్రాంతి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం జీ5 యాప్ లోకి వచ్చింది. ఆ చిత్రానికి 5 బాషల నుండి వస్తున్న వ్యూస్ ‘గేమ్ చేంజర్’ కి కేవలం ఒక్క భాష నుండి రావడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ వీడియో కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది మార్చి 27 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు AR రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు.