Sharwanand: హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొందరు ఫ్లాప్ లను మూట గట్టుకొని ఇతర వ్యాపారాలు చేసుకుంటే.. కొందరు మాత్రం హిట్ లతో దూసుకొనిపోతుంటారు. మరికొందరు మాత్రం కొన్ని హిట్ లు, మరికొన్ని ఫ్లాప్ లు అంటూ ఎత్తుపల్లాలు లేకుండా వారి కెరీర్ ను కొనసాగిస్తుంటారు. అదే విధంగా హీరో శర్వానంద్ కూడా కూడా కొన్ని హిట్ లు, మరికొన్ని ఫ్లాప్ లతో తన కెరీర్ ను నార్మల్ గా కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు శర్వా. ఈ నటుడి సినిమాలో మరో స్టార్ హీరో నటించనున్నారు. కానీ హీరోగా నటించిన కొందరు స్టార్లు తండ్రి, విలన్ రోల్స్ లో చేస్తూ మెప్పిస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు శర్వా సినిమాలో మరో స్టార్ హీరో తండ్రి పాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటికే శర్వానంద్ వరుసగా సినిమాలు చేస్తూ ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకుంటున్నారు. అయితే రీసెంట్ గా ఆయన శ్రీ రామ్ ఆదిత్య డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో శర్వానంద్ ఫాదర్ గా తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన విజయ్ సేతుపతి నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈయన ఇప్పటికే తెలుగులో ఉప్పెన సినిమాలో కృతి శెట్టికి ఫాదర్ గా నటించాడు. ప్రస్తుతం శర్వా కి ఫాదర్ గా కూడా నటిస్తున్నాడు.
విలక్షణ నటుడిగా పేరు సంపాదించిన విజయ్ సేతుపతి ఏ పాత్రలో అయినా ఒదిగి పోతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించారు. అంతేకాదు వరుస సినిమాల్లో నటిస్తూ సక్సెస్ లు అందుకుంటున్నాడు ఈ నటుడు. ఇక రెమ్యూనరేషన్ కూడా భారీగా అందుకుంటున్నారు విజయ్. ఈయన రెమ్యూనరేషన్ ఏకంగా కోట్లలో ఉందట. అయినా కూడా దర్శకనిర్మాతలు ఈయనను వదులుకోవడానికి ఇష్టపడరు. దీంతో ఇప్పుడు శర్వానంద్ సినిమాలో నటించడానికి సిద్దమవుతున్నాడు విజయ్. మరి చూడాలి వీరి కాంబినేషన్ లో సినిమా ఎలా ఉండబోతుందో…
Velishala Suresh is a Web Admin and is working with our organisation from last 3 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read More