Kajal Aggarwal: లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్.. చందమామ, మగధీర సినిమాలతో మెస్మరైజ్ చేసింది. ఈమె నటనకు, అందానికి ఫిదా అయ్యారు ప్రేక్షకులు. చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్ అగర్వాల్ హిందీ, తమిళంలో కూడా నటించి హిట్ లను అందుకుంది. కెరీర్ పీక్స్ టైమ్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు కిచ్లు ను వివాహం చేసుకుంది కాజల్. ఈ జంటకు పెళ్లి జరగడం, అదే సమయంలో కరోనా రావడం, ప్రెగ్నెంట్ అవడం అన్నీ కూడా ఏకకాలంలో జరగడంతో చిత్ర పరిశ్రమకు కాస్త గ్యాప్ ఇచ్చిందనే చెప్పాలి. కరోనా సమయంలో షూటింగ్ లు మొత్తం నిలిచి పోయిన సంగతి తెలిసిందే. ఇలా మొత్తం మీద రెండు సంవత్సరాల గ్యాప్ ఇచ్చింది చందమామ బ్యూటీ.
బాబుకు జన్మనిచ్చిన కాజల్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఈ అమ్మడు వరుస అవకాశాలతో దూసుకొనిపోతుంది. అయితే పెళ్లికి ముందే కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమాకు కమిట్ అయ్యారు.కమిట్ అయినట్టుగానే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు కూడా. అలాగే అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటించారు. అదేవిధంగా సత్యభామ అనే మరొక సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతుంది. ఇందులో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది కాజల్.
ఇదిలా ఉంటే భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇన్ని రోజులు తాను బాధ పడ్డ ఓ వ్యాధి గురించి అభిమానులతో పంచుకున్నారు కాజల్. అయితే ఎంత డైట్ చేసినా ఎన్ని వర్కౌట్స్ చేసినా తన బాడీకి ఏం కాదట ఫుడ్ తిన్న కూడా బరువు పెరగదట. ఒకవేళ జిమ్ కి వెళ్లడం మర్చిపోతే విపరీతమైన బరువు పెరుగుతుందట ఈ అమ్మడు. ఇలా పెరిగిన శరీర బరువు తగ్గించుకోవడం కోసం తిరిగి తాను నాలుగు రోజులపాటు జిమ్ లో భారీగా కష్టపడాల్సి వస్తుందంటూ తను ఎప్పటి నుంచో బాధ పడే ఈ వ్యాధి గురించి తెలిపింది.