Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda new movie poster: ఊహించని కాంబినేషన్ ని సెట్ చేసిన విజయ్ దేవరకొండ.....

Vijay Deverakonda new movie poster: ఊహించని కాంబినేషన్ ని సెట్ చేసిన విజయ్ దేవరకొండ.. ఈసారి కుంభస్థలం బద్దలే..

Vijay Deverakonda new movie poster: యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే ఆయన ఈ ఫీట్ ని సాధించారు. టాలీవుడ్ కి కొత్త స్టార్ హీరో వచ్చేసాడని అంతా అనుకున్నారు. కానీ ‘గీత గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచాయి. ఆయన గత […]

Vijay Deverakonda new movie poster: యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే ఆయన ఈ ఫీట్ ని సాధించారు. టాలీవుడ్ కి కొత్త స్టార్ హీరో వచ్చేసాడని అంతా అనుకున్నారు. కానీ ‘గీత గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచాయి. ఆయన గత చిత్రం ‘కింగ్డమ్’ కి మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా, కమర్షియల్ గా ఫెయిల్యూర్ అయ్యింది. ఇలా తాను అతి తక్కువ సమయంలో ఏర్పాటు చేసుకున్న మార్కెట్ మొత్తాన్ని పోగొట్టుకుంటున్నారు విజయ్ దేవరకొండ. అందుకే ఇప్పుడు స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ‘కింగ్డమ్’ చిత్రం తర్వాత ‘రౌడీ జనార్ధన’, ‘రణబలి ‘, ‘స్వారీ’ వంటి చిత్రాలను ఒప్పుకున్న విజయ్ దేవరకొండ , నేడు మరో క్రేజీ కాంబినేషన్ ని ప్రకటించాడు.

నేచురల్ స్టార్ నాని తో ‘హాయ్ నాన్న’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన సౌరవ్ తో నాని సరికొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ఇది మన మైథాలజీ కి సంబంధించిన లవ్ స్టోరీ అని అంటున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ని విడుదల చేయగా , దానికి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ నాలుగు నల్ల కుక్కలను పట్టుకొని , చేతిలో యుద్దపు కవచాన్ని ధరించాడు. ఆయన వెనుక డైరెక్టర్ సౌరవ్ తో పాటు , ఇతర టెక్నీషియన్స్ యుద్ధం లో ఉపయోగించే ఆయుధాలను ధరించి నడవడం హైలైట్ గా నిల్చింది. ఇక పోస్టర్ కి ఉన్న ‘ఆల్ థిస్ యాంగర్ వాస్ ఒన్స్ లవ్’ అనే క్యాప్షన్ కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగించింది.

ఇలా పోస్టర్ తోనే భారీ హైప్ ని నెలకొల్పింది ఈ చిత్రం. ఈ సినిమా పోస్టర్ కి ముందు విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేశాడు, ఆ తర్వాత ‘రణబలి’ గ్లింప్స్ వీడియో ని కూడా విడుదల చేశారు. కానీ ఈ రెండిటికి ఆడియన్స్ నుండి గొప్ప రెస్పాన్స్ రాలేదు. ఆ రెండు సినిమాలకు రానటువంటి రెస్పాన్స్, కేవలం ఈ ఒక్క పోస్టర్ తో రప్పించడం మామూలు విషయం కాదు. జెన్ జీ ఆడియన్స్ పల్స్ ని పట్టుకోవడం ఇక్కడ డైరెక్టర్ సౌరవ్ బ్లాక్ బస్టర్ అయ్యాడు అనే చెప్పాలి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సౌరవ్ సిద్ధంగా ఉన్నాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper