Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda Wedding Reception Invite: విజయ్ దేవరకొండ తన రిసెప్షన్ కి స్టార్ హీరోలందరిని...

Vijay Deverakonda Wedding Reception Invite: విజయ్ దేవరకొండ తన రిసెప్షన్ కి స్టార్ హీరోలందరిని పిలిచాడు…ఆ ఇద్దరిని తప్ప…వాళ్ళెవ్వరంటే..?

Vijay Deverakonda Wedding Reception Invite: ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప సినిమాలను తీయగలిగే కెపాసిటి ఉన్న దర్శకులు చాలామంది ఉన్నారు. అయినప్పటికి కొంతమందికి మాత్రమే ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపైతే వచ్చింది…ఇక స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వాళ్లు సైతం ఆయా దర్శకుల డైరెక్షన్లో నటించి భారీ విజయాలను సాధించారు. ముఖ్యంగా సందీప్ రెడ్డివంగ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాకి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఒక్క సినిమాతోనే […]

Vijay Deverakonda Wedding Reception Invite: ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప సినిమాలను తీయగలిగే కెపాసిటి ఉన్న దర్శకులు చాలామంది ఉన్నారు. అయినప్పటికి కొంతమందికి మాత్రమే ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపైతే వచ్చింది…ఇక స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వాళ్లు సైతం ఆయా దర్శకుల డైరెక్షన్లో నటించి భారీ విజయాలను సాధించారు. ముఖ్యంగా సందీప్ రెడ్డివంగ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాకి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఒక్క సినిమాతోనే విజయ్ స్టార్ హీరోగా మారిపోయాడు… ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ రష్మిక మందాన పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఫిబ్రవరి 26వ తేదీన వీళ్ళ పెళ్లి రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరుగుతుంది. అయితే వీళ్ళ పెళ్లికి పెద్దగా అతిథులు ఎవరు హాజరవ్వకపోతుండడం విశేషం… ఇక ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రెటీలు, సినిమా హీరోలు రాజకీయ నాయకులను హైదరాబాద్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కి పిలిచినట్టుగా తెలుస్తోంది. ఇక మార్చి 4వ తేదీ ఈ రిసెప్షన్ ఉండబోతుందట. ఈ ఫంక్షన్ కి ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు రావాలని వాళ్లందరికీ ఇన్విటేషన్ అందినప్పటికి నానికి అలాగే నిఖిల్ కి మాత్రం ఇన్విటేషన్ అయితే ఇవ్వలేదట.

కారణం ఏంటి అంటే నాని విజయ్ దేవరకొండకు మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయని అందువల్ల వాళ్ళిద్దరూ ప్రస్తుతం మాట్లాడుకోవడం లేదని వార్తలైతే వస్తున్నాయి. ఇక నిఖిల్ సైతం అర్జున్ రెడ్డి సినిమా వచ్చినప్పుడు విజయ్ దేవరకొండ మీద కొన్ని కామెంట్లయితే చేశాడు.

దాంతో అతనిని కూడా తను పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వీళ్లిద్దరి మధ్య కూడా మాటలైతే లేవట. ఇక వీళ్ళిద్దరితో పాటుగా విజయ్ ఇంకెవరికి ఇన్విటేషన్ ఇవ్వలేదనే విషయం మీద క్లారిటీ రావాల్సిన అవసరమైతే ఉంది. మొత్తానికైతే వీళ్ళిద్దరికీ ఇన్విటేషన్ రాలేదన్న న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా విజయ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు. కాబట్టి తను ఎలాంటి బేషజాలు లేకుండా తన తోటి హీరోలందరితో బాగుంటూనే అతని సినిమా కెరియర్ బాగుంటుందని మరి కొంతమంది సినిమా మేధావులు చెబుతున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper