Vijay Deverakonda Controversies: సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం ఇక్కడ బయట నుంచి చూసే వాళ్లకు రంగులు కనిపిస్తాయి. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళకి మాత్రం చుక్కలు కనిపిస్తాయనే చెప్పాలి. ప్రతి విషయాన్ని అవగాహన చేసుకొని ప్రేక్షకుడికి అర్థమయ్యే విధంగా ఆ సినిమాని తీర్చిదిద్దాలి అంటే దర్శకుడికి ఎంత మేధాశక్తి ఉండాలో అర్థం చేసుకోండి? అలాగే హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటే విధంగా నటించి మెప్పించాలి అంటే వాళ్లకి ఎంత గట్స్ ఉండాలి… ఇలా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు తమ తమ ప్రొఫెషన్ లో టాప్ లెవెల్ కి వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ సైతం రెండో సినిమాతోనే స్టార్ హీరోగా అవతరించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలతో ఆ రేంజ్ సక్సెస్ లను సాధించకపోవడంతో ఆయన కొంతవరకు వెనుకబడిపోయాడు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కి నచ్చని వాళ్లు కూడా ఉన్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయినప్పుడు కొంతమంది సినిమా సెలబ్రెటీలు దానిమీద విమర్శలు చేశారు. అందుకే అతను అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్లతో మాట్లాడటం లేదట…ఇక ఆ లిస్ట్ లో మొదట అనసూయ ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయినప్పుడు ఆమె ఆ సినిమాకి నెగెటివ్ గా పబ్లిసిటి చేసింది.
దానివల్ల విజయ్ దేవరకొండ సైతం అనసూయకు కౌంటర్ ఇస్తు కొన్ని కామెంట్లయితే చేశాడు. ఇక మొత్తానికైతే అప్పటినుంచి ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య మాటలైతే లేవట… ఇక ఖుషీ సినిమా షూటింగ్ సమయంలో శివ నిర్వాణకు విజయ్ కి మధ్య కొన్ని మనస్పర్ధలు కూడా వచ్చినట్టుగా తెలుస్తున్నాయి.
ప్రస్తుతం తనతో కూడా విజయ్ దేవరకొండ మాట్లాడటం లేదట. అలాగే విశ్వక్ సేన్ తో సైతం అతనికి మాటలు లేవని తెలుస్తుంది. ఫలక్ నామ దాస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ ను రమ్మంటే రాలేదట. దాంతో విశ్వక్ సేన్ విజయ్ మీద కొన్ని కామెంట్లయితే చేశాడు. దాంతో అప్పటి నుంచి విజయ్ విశ్వక్ సేన్ తో కూడా మాట్లాడటం లేదట…
ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఒక సినిమాకు సంబంధించిన వర్క్ చేస్తున్నప్పుడు ఇద్దరు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ అయితే రావడం సహజం… దాన్ని ఎంత సామరస్యంగా పరిష్కరించుకుంటే అంత మంచిది అంతే తప్ప వ్యక్తిగత కోపాలకు పోయి ఎవరికి వాళ్లు ఈగోలు హర్ట్ చేసుకొని మాట్లాడకుండా ఉండటం వల్ల ఎవరికి వచ్చేది ఏమీ లేదని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…