Homeఎంటర్టైన్మెంట్నారప్ప సిద్ధమవుతున్నాడు.. మరి ఓపెనింగ్స్ వస్తాయా ?

నారప్ప సిద్ధమవుతున్నాడు.. మరి ఓపెనింగ్స్ వస్తాయా ?

విక్టరీ వెంకటేష్ ఎంతో ఇష్టపడి కష్టపడి చేస్తున్న సినిమా ‘నారప్ప’. అందుకే మొదటి నుండి ఈ సినిమా కోసం వెంకీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాగా ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నారప్ప గురించి ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ ఇస్తూ.. ‘మరో వారం రోజుల్లో నారప్ప ఫస్ట్‌ కాపీ పూర్తి అవుతుందని, అందుకే ప్రస్తుతం రిలీజ్ డేట్ విషయం పై చర్చిస్తున్నాం అని, అతి త్వరలోనే నారప్ప […]

naappaవిక్టరీ వెంకటేష్ ఎంతో ఇష్టపడి కష్టపడి చేస్తున్న సినిమా ‘నారప్ప’. అందుకే మొదటి నుండి ఈ సినిమా కోసం వెంకీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాగా ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నారప్ప గురించి ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ ఇస్తూ.. ‘మరో వారం రోజుల్లో నారప్ప ఫస్ట్‌ కాపీ పూర్తి అవుతుందని, అందుకే ప్రస్తుతం రిలీజ్ డేట్ విషయం పై చర్చిస్తున్నాం అని, అతి త్వరలోనే నారప్ప విడుదలను అధికారికంగా ప్రకటిస్తాం అని శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొచ్చాడు.

ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌, పోస్టర్స్‌ తో పాటు వెంకటేశ్‌ బర్త్‌ డే సందర్భంగా రిలీజైన టీజర్‌ కు కూడా మంచి స్పందన రావడం.. ఈ సినిమా మార్కెట్ కి బాగా ప్లస్ కానుంది. నిర్మాత సురేష్ బాబు కూడా ఇదే ఫీల్ అవుతున్నారు. దాంతోనే నైజాంలో ఈ సినిమాకు భారీ రేటును చెబుతున్నారు. ఈ సినిమా కోసం మొదట్లో ఆసక్తి చూపించిన దిల్ రాజు, ఆ రేటు చూసి సైలెంట్ గా సైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది.

మరి, ఈ సినిమాను ఎవరు కొంటారో చూడాలి. ఎలాగూ సురేష్ ప్రొడక్షన్స్ కి కూడా థియేటర్స్ ఉన్నాయి కాబట్టి, ఓన్ రిలీజ్ కైనా సురేష్ బాబు ఇంట్రెస్ట్ చూపించొచ్చు. మరి ఏమి జరుగుతుందో చూడాలి. ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తోంది. సురేష్‌ బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మించిన ఈ సినిమాలో వైవిధ్యమైన షేడ్స్‌ ఉన్న పాత్రలో వెంకీ అలరించనున్నాడు.

అందుకే వెంకీ అభిమానులు ఈ చిత్రంకై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ప్రస్తుతం కరోనా ప్రవాహంలో జనం థియేటర్స్ మొహం కూడా చూడని పరిస్థితి ఉండే అవకాశం ఉంది కాబట్టి, నారప్పకి ఓపెనింగ్స్ వస్తాయా అనేది డౌటే. ఏది ఏమైనా కరోనా సెకండ్‌ వేవ్‌ కూడా సినీ పరిశ్రమను పెద్ద దెబ్బే కొట్టింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper