
పన్నుల పెంపును నిరసిస్తూ కార్పొరేషన్ కార్యాలయం వద్ద బీజేపీ నిరసనకు దిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతి రమేష్ నాయుడు మాట్లాడుతూ సీఎం దానకర్ణుడిలా దానం చేస్తూ పన్నుల పేరుతో ముక్కు పిండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. దేవాలయాల నిధులను వాహనమిత్రకు మళ్లిస్తారా అని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పన్నుల మోత ఏపీలో ఉందన్నారు. పన్నుల భారాలతో ఖజానా నింపుకోవడమా అని ప్రశ్నించారు. నిర్ణయం వెనక్కు తీసుకోవపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రమేశ్ నాయుడు హచ్చరించారు.