Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రికార్డులను బ్రేక్ చేసే సత్తా కొంతమందికి మాత్రమే ఉంటుంది. అందులో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి ఒక గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి.తొలిప్రేమ, ఖుషీ,గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన రీసెంట్ గా ఓజీ సినిమాతో మరోసారి గొప్ప విజయాన్ని అందుకొని భారీ రికార్డులను కొల్లగొట్టే దిశగా ముందుకు దూసుకెళ్తున్నాడు… ఇక ఇప్పుడు ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేశాడు. ఇక తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారు.
ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అవ్వబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అతని అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ ని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో చూడాలని కోరుకుంటున్నారు. చేగువేరా బయోగ్రఫీతో ఆయన సినిమా చేస్తే ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయి.
ఆ పాత్ర కి ఇండియాలో కూడా చాలా వాల్యూ ఉందని ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకొని తెలుగు సినిమా నేటివిటికి తగ్గట్టుగా ఆ పాత్రను మలుచుకుంటూ బాగుంటుంది. అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ పడితే పవన్ కళ్యాణ్ ఆ సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తాడు. ఆయనను ఇప్పటివరకు ఎవరు అలా చూపించలేదని ఇప్పుడున్న దర్శకులు అలా చూపిస్తే మాత్రం పాన్ రికార్డులు బ్రేక్ అవుతాయి చాలా మంది అతని అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…
ఇక దీని మీద దర్శక నిర్మాతలు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ సైతం అలాంటి సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తాడు. కానీ ఇప్పటివరకు అతని దగ్గరికి అలాంటి కథలతో ఎవ్వరు వెళ్ళడం లేదు. ఇక మీదట ఆయన కమర్షియల్ సినిమాలు కూడా మెసేజ్ ఇచ్చే సినిమాలు చేస్తే బాగుంటుంది…