Ustaad Bhagat Singh : ‘గబ్బర్ సింగ్’ లాంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), హరీష్ శంకర్(Harish shankar) కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చ్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ ని ఇప్పటి నుండే చిన్నగా మొదలు పెట్టే పనిలో ఉన్నారు. అందులో భాగంగా ఈ చిత్రం నుండి మొదటి లిరికల్ వీడియో సాంగ్ ప్రోమో ని ఈ నెల 9 వ తారీఖున సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్నీ కాసేపటి క్రితమే మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ స్టైల్ గా డ్యాన్స్ వేస్తూ చేతిలో తోపి పెట్టుకొని కనిపించడం హైలైట్ గా నిల్చింది.
సరిగ్గా మైఖేల్ జాక్సన్ వేసే స్టెప్పుల ఫోజులో పవన్ కళ్యాణ్ ఈ ఫొటోలో దర్శనమిచ్చాడు. ఇలా పవన్ కళ్యాణ్ ని చూడడం అభిమానులకు మొదటి సారి. ఆశలు ఆయన సరైన డ్యాన్స్ స్టెప్పులు వేయడం చూసి పదేళ్లు దాటింది. అలాంటి సమయం లో ఆయన నుండి ఇలాంటి ఎనర్జీ ఉన్న పోస్టర్స్ విడుదలైతే అభిమానుల్లో ఒంట్లో వెయ్యి వోల్టుల కరెంటు పాస్ అవుతుంది. కేవలం ప్రోమో తోనే అభిమానులను మెంటలెక్కిపోయేలా చేసే పనిలో ఉన్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. సుజిత్ పవన్ కళ్యాణ్ లోని స్టైలిష్ యాంగిల్ ని వాడుకొని సూపర్ హిట్ ని అందుకుంటే, హరీష్ శంకర్ ఆయనలోని మాస్ యాంగిల్ ని మరోసారి బయటకు తీసి ఆడియన్స్ ని అలరించే ప్రయత్నం చేసాడు. ఈ ప్రయత్నం లో ఒకసారి ఆయన సిక్సర్ కొట్టాడు. ఈసారి కూడా అదే రేంజ్ సిక్సర్ కొడుతాడో లేదో చూడాలి.
ఇకపోతే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ కి పని చేస్తున్న చిత్రమిదే. చాలా కాలం తర్వాత ఆయన చేస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా కావడం తో ప్రతీ పాటకు తన వైపు నుండి ది బెస్ట్ వచ్చేలా చేస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతం లో ‘గబ్బర్ సింగ్’, ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ వంటి సెన్సేషనల్ ఆల్బమ్స్ వచ్చాయి. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆల్బమ్ కి కూడా డీసెంట్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పైన ప్రస్తావించిన సినెమాలన్నిటినీ మించే రేంజ్ లో ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుంది అనేది.
Presenting the POWER STAR you loved, hailed and whistled for.
Now with more energy, unmatched attitude and blasting moves #UstaadBhagatSingh first single promo out on December 9th at 6.30 PM ❤Our CULT CAPTAIN @harish2you's feast with ROCKSTAR @ThisIsDSP's musical… pic.twitter.com/XzWt4kFs2q
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) December 7, 2025